Vijay Devarakonda: విజయ్ దేవరకొండ.. అందరి హీరోలతో పోలిస్తే ఈ రౌడీ హీరో కొంచెం డిఫరెంట్. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన దగ్గరనుంచి ఇప్పటివరకు అనుకోనివి చేస్తూ షాకుల మీద షాకులు ఇస్తూనే ఉన్నాడు. ఏ హీరో అయినా తన సినిమా ప్లాప్ టాక్ అందుకొంటే కొన్నిరోజులు మీడియాకు దూరంగా ఉంటారు కానీ విజయ్ మాత్రం జయాలు అపజయాలు కామన్ అంటూ వెంటనే నెక్స్ట్ సినిమాపై ఫోకస్ పెట్టాడు. ఇక ఒక హీరోను విమర్శిస్తే.. ఎవరైనా ఏం చేస్తారు. ట్విట్టర్ లోనో, లేక వేరేవారి దగ్గరో వారిపై కౌంటర్ వేస్తూ మాట్లాడతారు. కానీ రౌడీ హీరో మాత్రం విమర్శలు చేసిన వారిదగ్గరకు వెళ్లి మరీ నిజానిజాలు ఏంటి అని చెప్పి వారిచేత మంచి హీరో అని అనిపించుకున్నాడు. అసలు విషయం ఏంటంటే.. లైగర్ సినిమా ప్లాప్ కావడంతో .. అతడి వలనే తమకు నష్టాలు మిగిలాయని ప్రముఖ మల్టీప్లెక్స్, థియేటర్ మరాఠా మందిర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనోజ్ దేశాయ్ విమర్శలు చేసిన విషయం విదితమే.
విజయ్ కు ఒళ్ళంతా పొగరు. వినాశకాలే విపరీత బుద్ది. లైగర్ ప్రమోషన్స్ లో అతడు చేసిన ఓవర్ యాక్షన్ వలన సినిమా పోయింది. అతడి వలనే మేము నష్టపోయాం. అతడు దేవరకొండ కాదు అనకొండ అంటూ మనోజ్ దేశాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలు వైరల్ గా మారడంతో నేడు విజయ్ దేవరకొండ, మనోజ్ దేశాయ్ ను కలిసి మాట్లాడాడు. అసలు ఆ ప్రమోషన్స్ లో జరిగింది ఏంటో వివరించాడు.దీంతో తప్పు తెలుసుకున్న థియేటర్ యజమాని విజయ్ కు సారీ చెప్పాడు. “విజయ్ దేవరకొండ మాట్లాడిన దాంట్లో చిన్న బిట్ మాత్రమే నాకు ఎవరో పంపారు. అది చూసి నేను అతన్ని విమర్శించాను. విజయ్ నన్ను కలిసి తానేం మాట్లాడాడో పూర్తి వీడియో చూపించాడు. అతనిపై అనవసరంగా విమర్శలు చేశానని సారీ చెప్పాను. అతని లైగర్ సినిమాకు వసూళ్లు బాగున్నాయి. ఇలాగే కష్టపడి కెరీర్ లో ఇంకా ఎదుగాలని కోరుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఇక రౌడీ హీరో ఫ్యాన్స్ ఈ ఫోటోలను వైరల్ గా మార్చేస్తున్నారు.
