రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఏం చేసిన సోషల్ మీడియాలో ఒక వర్గం మాత్రం ట్రోల్ చేయడానికి రెడీగా ఉంటారు. ఎప్పటికప్పుడు విజయ్ ఫోటో బయటకి వచ్చినా కూడా నెగటివ్ ట్రెండ్ చేస్తుంటారు. విజయ్ దేవరకొండపైన ఈ హేట్రెడ్ కి కారణం ఏంటో తెలియదు కానీ విజయ్ నుంచి ఏ ప్రమోషనల్ కంటెంట్ వచ్చినా నెగటివ్ కామెంట్స్ మాత్రం సర్వసాధారణం అయిపొయింది. లేటెస్ట్ గా ఇలాంటిదే ఒకటే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ ‘ది ఫ్యామిలీ స్టార్’. గీతా గోవిందం కాంబినేషన్ లో రిపీట్ చేస్తూ పరశురామ్… విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నాడు. విజయ్ ఇందులో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పర్సన్ లా కనిపించబోతున్నాడు. మృణాల్… విజయ్ కి వైఫ్ క్యారెక్టర్ ప్లాన్ చేస్తోంది. ది ఫ్యామిలీ స్టార్ సినిమా ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ చేసినప్పుడు “ఐరనే వంచాలా ఏంటి” అనే డైలాగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.
యాంటీ ఫ్యాన్స్ విజయ్ ని టార్గెట్ చేసి ఎక్కడ పడితే అక్కడ ఈ డైలాగ్ ని పేరడీ చేసి వాడారు. ఇప్పుడు లేటెస్ట్ గా ఏప్రిల్ 5న ది ఫ్యామిలీ స్టార్ సినిమా రిలీజ్ అవుతుంది అనే అనౌన్స్మెంట్ ఇచ్చారు మేకర్స్. ఈ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ పోస్టర్ లో విజయ్ దేవరకొండ రేషన్ షాప్ కి వెళ్తూ ఆధార్ కార్డుని తీసుకోని వెళ్తున్నాడు. దీంతో రేషన్ షాప్ కి ఆధార్ కార్డ్ ఎందుకు అన్నా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మృణాల్ కోసం బస్ లో చూపించడానికి తీసుకోని వెళ్తున్నాడు నీకు అవసరమా అని ఎవరికి తోచిన కామెంట్స్ వాళ్లు చేస్తున్నారు. అయితే రేషన్ షాప్ లో ఆధార్ కార్డ్ నెంబర్ చెప్తే చాలు రేషన్ ఇస్తారు అనే విషయాన్ని మర్చిపోయినట్లు ఉన్నారు. ఈ విషయం తెలియకే విజయ్ దేవరకొండ పోస్టర్ పై నెగటివ్ కామెంట్స్ చేస్తున్నట్లు ఉన్నారు.