Site icon NTV Telugu

Vijay Devarakonda: ‘కమింగ్’ అంటూ పోస్ట్.. ‘లైగర్’ గురించేనా?

Liger Movie

Liger Movie

విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ‘లైగర్’ సినిమా నుంచి బిగ్ అప్‌డేట్ రానున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి హీరో విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో ‘కమింగ్’ అంటూ ట్వీట్ చేశాడు. ఈ క్రమంలో ‘లైగర్’ నుంచి టీజర్ లేదా ట్రైలర్ రిలీజ్ కాబోతుందని అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు. లైగర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 25న రిలీజ్ కానుంది. ఈ మూవీలో అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. ఇస్మార్ట్ శంకర్ వంటి హిట్ సినిమా తర్వాత పూరీ జగన్నాథ్ నుంచి వస్తున్న సినిమా ఇదే కావడంతో అభిమానుల అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే ‘లైగర్’ మూవీ షూటింగ్ పూర్తి చేసుకోగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

Read Also: Tenth Class Diaries Review: టెన్త్ క్లాస్ డైరీస్‌

లైగర్ తర్వాత విజయ్ దేవరకొండ-పూరీజగన్నాథ్ కాంబోలో మరో సినిమా కూడా రాబోతోంది. పూరీ తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘జనగణమన’ను విజయ్‌తోనే తెరకెక్కిస్తున్నాడు. లైగర్ సినిమా రిజల్ట్ చూడకుండానే పూరీకి విజయ్ మరో అవకాశం కట్టబెఉట్టాడు. ప్రస్తుతం జనగణమన సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఇదిలా ఉండగానే.. మరోవైపు ఈ క్రేజీ కాంబినేషన్‌లో హ్యాట్రిక్ ప్రాజెక్టు కూడా రాబోతుందని ఫిలింనగర్‌లో ప్రచారం జరుగుతోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ ఈ వార్త నిజమైతే ఒకే దర్శకుడితో ఒకే హీరో ఏకకాలంలో వరుసగా మూడు ప్రాజెక్టులు చేయడం ఇటీవల కాలంలో ఇదే తొలిసారి అని చెప్పాలి.

Read Also:Shikaaru Review: షికారు

Exit mobile version