Site icon NTV Telugu

Vijay Devarakonda: అప్పుడే సామ్ ని టీజ్ చేయడం కూడా మొదలుపెట్టేశాడే..

Vijay

Vijay

టాలీవుడ్ రౌడీ హీరో  విజయ్ దేవరకొండ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అర్జున్ రెడ్డి చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిన విజయ్ లైగర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారాడు. ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ, శివ నిర్వాణ దర్శకత్వంలో ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ చేయబోతున్న సంగతి తెలిసిందే. నేడు పూజా కార్యక్రమాలను జరుపుకున్న ఈ చిత్రంలో విజయ్ సరసన సమంత నటిస్తోంది. అయితే ఈ పూజా కార్యక్రమానికి సమంత అటెండ్ కాకపోవడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇంత పెద్ద ప్రాజెక్ట్ కి సంబంధించి పూజ జరుగుతుంటే సామ్ ఎక్కడికి వెళ్లిందని ఫ్యాన్స్ ఆరా తీశారు.

తన సినిమాలకు సంబంధించిన బిజీ  షెడ్యూల్స్ ని పూర్తి చేసి సామ్ వెకేషన్ కి కోసం దుబాయ్ కి వెళ్లిన విషయం విదితమే. అయితే ఉదయం నుంచి సామ్ ఎక్కడ ..? సామ్ ఎక్కడ..? అని సోషల్ మీడియాలో వార్తలు  గుప్పుమంటున్న తరుణంలో రౌడీ బాయ్ విజయ్  సామ్ ను టీజ్ చేయడమే కాకుండా.. అభిమానులను కూడా ఆట పట్టించాడు. ఒరిజినల్ పూజా  కార్యక్రమంలోని గ్రూప్ ఫొటోలో సమంత, వెన్నెల కిషోర్ , రాహుల్ రామకృష్ణ ఫోటోలను ఎడిట్ చేసి.. ఇది ఈరోజు జరిగిన పూజా కార్యక్రమం ఒరిజినల్ ఫోటో.. దయచేసి మీడియా మిత్రులు ఈ ఫోటోను వాడవాల్సిందిగా కోరుతున్నాం అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ ట్వీట్ కు సామ్ నవ్వుతున్న ఎమోజీ ని షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. సినిమా ఇంకా మొదలే కాలేదు రౌడీ బాయ్ .. సామ్ ని టీజ్ చేస్తున్నాడే  అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

 

 

Exit mobile version