Site icon NTV Telugu

Vijay Devarakonda: ఛీఛీ.. సమంత ఇలా చీట్ చేస్తుంది అనుకోలేదు

Sam

Sam

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖుషీ. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక మొదటి నుంచి కూడా ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. అందుకు కారణం విజయ్ దేవరకొండ, సమంత కాంబో ఒకటైతే.. విజయ్ దేవరకొండ లవ్ స్టోరీ చేయడం.. మరొకటి లైగర్ సినిమా తరువాత విజయ్ లవ్ స్టోరీ చేయడం. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన విజయ్ దేవరకొండ, ఇప్పటికే అన్ని రాష్ట్రాలను కవర్ చేసి వచ్చాడు. ఇక ఈ మధ్యనే వెకేషన్ నుంచి ఇండియాకి వచ్చిన సమంత కొన్ని ఇంటర్వ్యూస్ ఇవ్వడం మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే రియల్ కపుల్ వర్సెస్ ఖుషీ టీమ్ ఒక ఇంటర్వ్యూ చేసింది. సుమ కనకాల, రాజీవ్ కనకాల హోస్టులుగా వ్యవహరించిన ఈ ఇంటర్వ్యూలో సమంత గురించి విజయ్ దేవరకొండ ఒక ఆసక్తికరమైన విషయాన్ని తెలిపాడు. సమంత చాలా చీట్ చేస్తుందని తనెప్పుడూ అలా చీట్ చేస్తుందని అనుకోలేదని చెప్పుకొచ్చాడు.

Naga Chaitanya: సమంతను చూసి.. థియేటర్ లో నుంచి బయటకొచ్చేసిన చై.. ?

” నాకు సామ్ మీద ఎంత గౌరవం అంటే.. ఒక ఇన్సిడెంట్ లో సామ్ ఇంటిలిజెన్స్ తెలిసింది. నేనే ఇంటెలిజెంట్ అని నా ఫీలింగ్.. అస్సలు బోర్డు గేమ్స్ లో సామ్ ఎంత చీట్ చేస్తుంది అంటే.. అన్ని ఒప్పుకొనేలా ఉంటాయి.. ఛీఛీఛీ.. ఎంత చీటింగ్ అంటే.. అని అంటున్న విజయ్ ను ఆపి వెన్నెల కిషోర్ మాట్లాడుతూ.. విజయ్.. ముందు ప్రాక్టీస్ చేసి.. బిగినర్స్ తో ఆడతాడు అని చెప్పుకొచ్చాడు ఇక దీనికి విజయ్.. ప్రెస్ కూడా నన్ను ఇంత మిస్ రిప్రజెంట్ చేయలేదు అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Exit mobile version