Vijay Devarakonda Speech At Liger Pre Release Event: గుంటూరులో గ్రాండ్‌గా నిర్వహించిన ‘లైగర్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. స్టోరీ డిస్కషన్స్ సమయంలో జరిగిన ఓ అనూహ్యమైన ఘటనని పంచుకున్నాడు. తనకు స్టోరీ చెప్తున్నప్పుడు డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్ ‘వీడు ఏం సమాధానం చెప్తాడా?’ అని నా ముఖం చూస్తున్నారని.. అప్పుడు తన నోటి నుంచి ‘మెంటల్’ అనే పదం వచ్చిందని అన్నాడు. స్టోరీ విన్న వెంటనే, చాలా త్వరగా ఈ సినిమాను మనోళ్లకు చూపిస్తే మస్త్ ఎంజాయ్ చేస్తారన్న ఉద్దేశంతో వెంటనే షూటింగ్ స్టార్ట్ చేశామని అన్నాడు. సెట్స్ మీదకి వెళ్లాక ప్రతి ఒక్క రోజు సీన్ చేస్తున్నప్పుడు కూడా తన నోటి నుంచి ‘మెంటల్’ అనే పదం వచ్చిందన్నాడు. ఈ సినిమాలో ఉండే ప్రతీ సీన్ సరికొత్త త్రిల్ ఇస్తుందని, త్వరగా సినిమాని తీసుకొద్దామనుకున్నాం గానీ, కొన్ని కారణాల వల్ల మూడు సంవత్సరాల సమయం పట్టిందన్నాడు.
అయితే.. ఇప్పుడు ఎక్కువ కాలం వెయిట్ చేయాల్సిన అవసరం లేదని, మరో ఐదు రోజుల్లోనే ఈ సినిమా వస్తుందని, తప్పకుండా ఈ సినిమా కుమ్మేస్తుందని విజయ్ హామీ ఇచ్చాడు. ఆగస్టు 25వ తేదీన మీరు (అక్కడున్న అభిమానుల్ని ఉద్దేశిస్తూ) గుంటూరుని షేక్ చేయాలని కోరాడు. తాను గుంటూరుకి రావాలని ఎప్పట్నుంచో వేచి చూస్తున్నానని, తనకు ఆరోగ్యం సహకరించకపోయినా ఎట్టకేలకు మీకోసం వచ్చానని విజయ్ అన్నాడు. ఇండియాలో ఎక్కడికెళ్లినా మీరు అమితమైన ప్రేమని చూపించారని.. తానూ ఈ లైగర్‌తో తిరిగి ఆ ప్రేమను కచ్ఛితంగా పంచుతానని అన్నాడు. ఈ చిత్రం ఒక మెమొరబుల్‌గా నిలిచిపోతుందని చెప్పాడు. తాను 60 ఏళ్ల తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పాక ఖాళీగా కూర్చుకున్నప్పుడు.. ఈ 20 రోజుల్లో మీరు చూపించిన ప్రేమనే గుర్తు చేసుకుంటానని, అంతలా మీరంతా ఆదరించారంటూ ఫ్యాన్స్‌ని ఉద్దేశిస్తూ తెలిపాడు. ‘ఆగస్టు 25న వాట్ లగా దేంగే’ అంటూ విజయ్ తన ప్రసంగం ముగించాడు.
