Site icon NTV Telugu

అవును.. రీసెంట్ గా బ్రేకప్ అయ్యింది.. ఆ బాధలోనే ఉన్నా- విజయ్ దేవరకొండ

రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ ‘లైగర్’ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. మరోపక్క నిర్మాతగా మారి తమ్ముడి సినిమాలను నిర్మిస్తున్నాడు. తాజాగా ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ‘పుష్పక విమానం’ త్వరలోనే విడుదల కానున్న వేళ దేవరకొండ బ్రదర్స్ ప్రమోషన్స్ మొదలు పెట్టేసారు. ప్రమోషన్స్ ని కూడా వెరైటీగా స్టార్ చేసే విజయ్ దేవరకొండ, తమ్ముడి ఆనంద్ దేవరకొండలో కలిసి గూగుల్ ప్రశ్నలకు సమాదానాలు చెప్పారు. వీరిద్దరి గురించి గూగుల్ లో ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.

అందులో విజయ్ దేవరకొండ సింగిలా..? అన్న ప్రశ్నకు విజయ్ షాకింగ్ ఆన్సర్ ఇచ్చాడు. ఇటీవలే నాకు బ్రేకప్ అయ్యింది.. ఈ విషయం ఎవరికి చెప్పలేదు.. కొంచెం బాధలో ఉన్నా అని చెప్పుకొచ్చాడు. దీంతో అభిమానులందరూ షాక్ కి గురయ్యారు. విజ్జయి నిజంగా చెప్పాడా..? లేక సరదాగా అన్నాడా… అని కొందరు ఆలోచిస్తుంటే.. ఇంకొందరు మాత్రం ఆ అమ్మాయి ఎవరు..? అని ఆలోచిస్తున్నారు. మరి రౌడీ హీరోతో బ్రేకప్ చెప్పిన ఆ అమ్మాయి ఎవరో తెలియాలంటే రౌడీ హీరోనే నోరువిప్పాలేమో..

Exit mobile version