Site icon NTV Telugu

Liger: బిగ్ అప్డేట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ.. హంట్ మొదలు

Vijay Devarakonda Fans Request to Puri Jagannath

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబో లో తెరకెక్కుతున్న చిత్రం ‘లైగర్’. పూరి- ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని హిందీలో కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, స్పెషల్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా ఈ సినిమా భారీ అంచనాలను రేకెత్తించాయి. ఇక ఈ చిత్రంలో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుండగా.. ప్రముఖ బాక్సింగ్ ఛాంపియన్  మైక్ టైసన్ గెస్ట్ గా కనిపించనున్నాడు.

ఇక ఆగస్టు25 న రిలీజ్ కానున్న ఈ చిత్రానికి సంబంధించిన ఒక అప్డేట్ ను  మే 9 న విడుదల చేయనున్నట్లు మేకర్స్ రెండు రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. లైగర్ హంట్ మొదలు అంటూ హింట్ ఇచ్చిన మేకర్స్ తాజాగా ఆ సర్ ప్రైజ్  ఏంటో రివీల్ చేశారు. ‘లైగర్’ థీమ్ సాంగ్ ను మే 9 న సాయంత్రం 4 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. “ఇండియా.. ఇప్పటివరకు చాలా ప్రశాంతంగా ఎదురుచూశాం.. ఇక మా వేట మొదలయ్యింది” అంటూ విజయ్ దేవరకొండ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ ‘లైగర్’ థీమ్ ఎలా ఉండబోతుందో చూడాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే.

Exit mobile version