రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఏది చేసినా ప్రత్యేకమే.. ఆయన సినిమాలను ప్రమోట్ చేసే విధానం ఎప్పుడు కొట్టగానే ఉంటుంది. ఇక తాజాగా విజయ్ నిర్మాతగా మారి తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్పక విమానం’. దామోదర దర్శకత్వంలో రూపొందిన ఈ కామెడీ ఎంటర్టైనర్ ఈ నెల 12 న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే దేవరకొండ బ్రదర్స్ ప్రమోషన్స్ పీక్స్ కి చేరుకున్నాయి. నిన్న వైజాగ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్లిన ఈ ఇద్దరు బ్రదర్స్ ఒక హోటల్ రూమ్ లో బస చేశారు.
ఉదయం లేవగానే విజయ్ తన బెడ్ వీడియోను షేర్ చేసాడు. తమ్ముడిని టీజ్ చేస్తూ తీసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గామారింది. ” నా పక్కన ఎవరు పడుకున్నారో గెస్ చేయండి అంటూ పక్కనే ఉన్న తమ్మడుని లేపుతూ సుందర్.. లేరా..నువ్వు ఇక్కడ ఉన్నావేంటి..? నీ పెళ్ళాం ఎక్కడ.. అంటూ ఆట పట్టించాడు. దానికి ఆనంద్ దేవరకొండ నా పెళ్ళాం లేచిపోయింది అని చెప్పి దుప్పటి ముసుగుకప్పి పడుకున్నాడు. ఈ ఫన్నీ వీడియో ప్రమోషన్లో భాగమే అయినా దేవరకొండ బ్రదర్స్ బాండింగ్ ని తెలియజేస్తుంది అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.