Site icon NTV Telugu

Vijay : చెన్నై ఎలక్షన్స్ లో హీరో వల్ల అసౌకర్యం… సారీ చెప్పిన స్టార్

Vijay

ప్రస్తుతం చెన్నైలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే కోలీవుడ్ స్టార్, తలపతి విజయ్ కూడా తన ఓటును వినియోగించుకున్నారు. అయితే విజయ్ ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు ఆయన ఫోటోలను తీయడానికి మీడియా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడంతో అక్కడ ఉన్న సాధారణ జనాలకు ఇబ్బంది కలిగింది. తనవల్ల అక్కడున్న ప్రజలకు కలిగిన అసౌకర్యాన్ని గమనించిన విజయ్ వెంటనే అందరికీ క్షమాపణలు చెప్పాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఆయన సింప్లిసిటీ అభిమానుల మనసును దోచుకుంటోంది.

Read Also : Jaggu Bhai : గర్వించదగిన క్షణం ‘పుష్ప’రాజ్… బన్నీ హంబుల్ రిప్లై

ఈ సార్వత్రిక ఎన్నికలలో చాలా మంది దళపతి అభిమానులు కూడా పోటీ చేస్తున్నారు. ప్రచారంలో అభిమానుల సంఘం అయిన “తలపతి విజయ్ మక్కల్ ఇయక్కం” (TVMI) జెండా, పేరును ఉపయోగించడానికి అభిమానులు నటుడి అనుమతిని కోరారు. ఆయన కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. మరోవైపు విజయ్ తండ్రి, ప్రముఖ దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ “ఆల్ ఇండియా తలపతి విజయ్ మక్కల్ ఇయక్కం” అనే రాజకీయ పార్టీని ప్రారంభించారు. అందులో ఆయన జనరల్ సెక్రటరీగా, విజయ్ తల్లి శోభా చంద్రశేఖర్ కోశాధికారిగా ఉన్నారు. అయితే విజయ్ తన పేరును రాజకీయ ఎజెండాలో ఉపయోగించుకున్నందుకు అతని తల్లిదండ్రులపై కేసు పెట్టడం అప్పట్లో సంచలనంగా మారింది. విజయ్ తన పేరుపై ఉన్న తండ్రి పార్టీని రద్దు చేసినట్లు కోర్టుకు తెలిపారు

నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో విజయ్, పూజా హెగ్డేతో కలిసి తమిళ చిత్రం “బీస్ట్” షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం ఇటీవల విడుదలైన “అరబిక్ కుతు” పాట ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.

https://twitter.com/MADHESVJ1/status/1494877916941156363
Exit mobile version