Star War: చిత్ర పరిశ్రమ లో స్టార్ వార్స్ నడుస్తూ ఉండడం సాధారణమే. టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ వార్స్ ఉన్నా ఇప్పుడు కొద్దిగా తగ్గాయనే చెప్పాలి. మా హీరో ఎక్కువ.. మీ హీరో తక్కువ అని గొడవలు పడే యువత ప్రస్తుతం కంటెంట్ బావుంటే ఏ సినిమా అయినా చూస్తాం అని చెప్పుకొస్తున్నారు. ఇక టాలీవుడ్ ను పక్కన పెడితే.. ఇప్పటికీ స్టార్ వార్ లో రక్తపాతాన్ని తలపించే ఇండస్ట్రీ కోలీవుడ్. తమిళ్ లో ఎంతమంది హీరోలు ఉన్నా ఒక్క విజయ్- అజిత్ అభిమానుల మధ్యనే స్టార్ వార్స్ జరుగుతూ ఉంటాయి. అది ఎంతలా అంటే సోషల్ మీడియాలో విజయ్ చంపేస్తారు అజిత్ ఫ్యాన్స్. అజిత్ కు పూల మాల వేసి రిప్ అని వైరల్ చేస్తారు విజయ్ అభిమానులు. ఇంతలా జరుగుతాయి అక్కడ స్టార్ వార్స్.
ఒక హీరో సినిమా వచ్చింది అంటే వేరే హీరో ఫ్యాన్స్ ఆ సినిమాను ఎలా ప్లాప్ చేయాలని చూస్తూ ఉంటారు. ఇప్పటివరకు విజయ్- అజిత్ సినిమాలు ఒకేసారి తలపడలేదు కాబట్టి సరిపోయింది. కానీ ఈసారి ఈ రెండు పందెం కోళ్లు సంక్రాంతిలో ఢీ కొట్టడానికి రెడీ అవుతున్నాయి. అవును.. విజయ్ నటించిన వారిసు.. అజిత్ నటించిన తునీవు సంక్రాంతి బరిలో దిగనున్నాయి. దాదాపు తొమ్మిదేళ్ల తరువాత ఈ స్టార్ హీరోల మధ్య పోటీ జరగనుంది. మరి ఈ సినిమాలప్పుడు వీరి అభిమానులు ఎంతటి రచ్చ చేస్తారో చూడాలి.
