Site icon NTV Telugu

Vidudala: గీత ఆర్ట్స్ బ్యానర్ కి మరో కాంతార అవుతుందా?

Geetha Arts 2

Geetha Arts 2

ఈమధ్య ఒక సినిమా ఒక భాషలో రిలీజ్ అవుతుంది అంటే ఒకప్పుడు దాన్ని రీమేక్ చెయ్యడానికి ఇతర ఇండస్ట్రీల ఫిల్మ్ మేకర్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించే వాళ్లు. ఇటివలే కాలంలో రీమేక్స్ కాస్త తగ్గి, అదే సినిమాని డబ్ చెయ్యడం మొదలు పెట్టారు. తమిళ్, మలయాళం, కన్నడ… ఇలా ఏ బాషలో సినిమా బాగుంది అనే మాట వినిపించినా దాన్ని దిల్ రాజు, అల్లు అరవింద్, సురేష్ బాబు లాంటి ప్రొడ్యూసర్స్ తెలుగులోకి డబ్ చేస్తున్నారు. లవ్ టుడే సినిమా దిల్ రాజుకి మంచి కలెక్షన్స్ ని తెచ్చిపెట్టింది. ఇలానే పాన్ ఇండియా హిట్ అయిన కాంతార సినిమా కూడా గీత ఆర్ట్స్ కి వసూళ్ల వర్షం కురిపించింది. రిషబ్ శెట్టి నటిస్తూ, దర్శకత్వం వహించిన ఈ మూవీ ముందుగా కర్ణాటకలో రిలీజ్ అయ్యి సెన్సేషనల్ టాక్ రాబట్టింది. వర్డ్ ఆఫ్ మౌత్ కర్ణాటక బౌండరీలు దాటి వినిపించడంతో కాంతార సినిమాకి అన్ని భాషల్లో డిమాండ్ పెరిగింది. దీంతో గీత ఆర్ట్స్ కాంతార సినిమాని తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేసి సాలిడ్ కలెక్షన్స్ ని రాబట్టింది. ఇదే కోవలో మరో హిట్ సినిమాని తెలుగులో రిలీజ్ చెయ్యడానికి గీత ఆర్ట్స్ రెడీ అయ్యింది.

తమిళ్ లో ఇటివలే రిలీజ్ అయిన ‘విడుదలై పార్ట్ 1’ సినిమా సూపర్ హిట్ అయ్యింది. వెట్రిమారన్ స్టైల్ ఆఫ్ మేకింగ్, సూరి మెస్మరైజింగ్ పెర్ఫార్మెన్స్, విజయ్ సేతుపతి స్టన్నింగ్ యాక్టింగ్, రియలిస్టిక్ అండ్ ట్రూ టు కంటెంట్ ఉన్న నేరేషన్ ఆడియన్స్ ని కట్టి పడేసాయి. తమిళనాడులో సెకండ్ వీక్ లోకి ఎంటర్ అయిన విడుదలై పార్ట్ 1 సినిమాని గీత ఆర్ట్స్ తెలుగులో విడుదల పార్ట్ 1గా రిలీజ్ చెయ్యడానికి రెడీ అయ్యారు. ఏప్రిల్ 15న విడుదల పార్ట్ 1 సినిమా తెలుగులో రిలీజ్ కానుంది. దీంతో మేకర్స్ ఈ మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. రా, ఇంటెన్స్, రియలిస్టిక్ మేకింగ్ చూడాలి అనుకున్న వాళ్లు విడుదల పార్ట్ 1 సినిమాని ఏప్రిల్ 15న చూసి ఎంజాయ్ చెయ్యండి. మరి ఈ మూవీ గీత ఆర్ట్స్ కి మరో కాంతార అవుతుందేమో చూడాలి.

Exit mobile version