Site icon NTV Telugu

Vidudala: క్లైమాక్స్ లో ఎమోషన్ కి కనెక్ట్ అయి చప్పట్లు కొట్టేశాను: అల్లు అరవింద్

Vidudala

Vidudala

Allu Aravind: మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఈ నెల 15న విడుదల చేస్తున్న సినిమా ‘విడుదల -1’. ఇప్పటికే తమిళనాట విడుదలై విజయం సాధించిన ఈ సినిమాను సూరి, భవాని శ్రీ జంటగా వెట్రిమారన్ తెరకెక్కించారు. విజయ్ సేతుపతి ఇందులో ఓ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా తెలుగులో విడుదల కాబోతున్న నేపథ్యంలో మంగళవారం మీడియాతో చిత్ర బృందం సమావేశమైంది. ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్, నిర్మాత ఎల్రెడ్ కుమార్‌, దర్శకుడు వెట్రిమారన్, హీరో సూరి, భవాని శ్రీ పాల్గొన్నారు.
నిర్మాత ఎల్రెడ్ కుమార్‌ మాట్లాడుతూ, “ఈ సినిమా కంప్లీట్ గా కాన్సెప్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. తమిళ్ లో అల్లు అరవింద్ గారు చూసి అప్రిషియేట్ చేశారు. ఆయనే ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులకు అందించడానికి ముందుకొచ్చినందుకు ధన్యవాదాలు. ఇంత అద్భుతమైన సినిమాని వెట్రిమారన్ నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. కుమరేశన్ పాత్ర కోసం సూరి ఈ సినిమాలో చాలా బాగా కష్టపడ్డాడు. అది మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది. పాప క్యారెక్టర్ లో భవాని అద్భుతంగా ఒదిగిపోయింది” అని అన్నారు. భవాని శ్రీ మాట్లాడుతూ, “‘విడుదల’ పార్ట్ 1 తెలుగులో రిలీజ్ అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. వెట్రిమారన్ గారు ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ ను క్రియేట్ చేశారు. సూరి, విజయసేతుపతి లాంటి వారితో వర్క్ చేయటం మంచి అనుభవం. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు మంచి సినిమాలు ఆదరిస్తారు. ఈ సినిమాని తెలుగులో కూడా థియేటర్ లో ఎక్స్ పీరియన్స్ చేయాలని కోరుకుంటున్నాను” అని ఆశాభావం వ్యక్తం చేసింది.
హీరో సూరి మాట్లాడుతూ, “ఈ సినిమాను తెలుగులో అందిస్తున్నందుకు అల్లు అరవింద్ గారికి థాంక్యూ. చెన్నయ్ సూరి, కుమరేశన్ హైదరాబాద్ వరకు వచ్చేశాడు. నాకు ఈ సినిమాలో ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన వెట్రిమారన్ సర్ కి, ఎల్రెడ్ కుమార్‌ సర్ కి థాంక్యూ” అని అన్నారు. దర్శకుడు వెట్రిమారన్ మాట్లాడుతూ, “నేను తీసే సినిమాలు ఎప్పుడు రూటెడ్ గానే ఉంటాయి. ఈ సినిమా తెలుగులో రిలీజ్ అవుతుంది అనుకోలేదు. ఈ సినిమాను తెలుగులో అల్లు అరవింద్ గారు రిలీజ్ చేయడానికి ఒప్పుకున్నందుకు థాంక్యూ. ఆయన ఈ సినిమాను థియేటర్లోనే చూస్తాను అని చెప్పి థియేటర్లో చూసి, రాత్రి రెండు గంటలకి ఫోన్ మాట్లాడి పొద్దున్నే నన్ను కలిశారు అరవింద్ గారు. ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయడానికి ఒప్పుకున్నారు. ఈ సినిమాను నాలుగు కోట్ల బడ్జెట్ తో 30 నుంచి 35 రోజుల్లో ఒక చిన్న సినిమాగా ఫినిష్ చేద్దాం అనుకున్నాం. కానీ ఈ సినిమా మూడు రెట్లు ఎక్కువ ఖర్చుతో వంద రోజులు పైగా షూటింగ్ జరుపుకుంది. నిర్మాత ఎల్రెడ్ కుమార్‌ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఖచ్చితంగా అవసరం. ఇళయరాజా గారు మంచి ట్యూన్స్ అందించారు. ఈ సినిమాను మీరు ఆదరిస్తారని ఆశిస్తున్నాను” అని అన్నారు. నిర్మాత అల్లు అరవింద్ గారు మాట్లాడుతూ, “ఇవాళ లోకల్ ఈజ్ గ్లోబల్ అయిపోయింది. ఈ సినిమా చూసిన తర్వాత క్లైమాక్స్ లో ఎమోషన్ కి కనెక్ట్ అయి లేచి చప్పట్లు కొట్టేశాను. వెట్రిమారన్ అంటే చాలా రోజులు నుంచి నాకు ఇష్టం. ఆయన సినిమాలు అన్ని చూస్తాను. ఆయనే సినిమాలే కాకుండా ఆయన ఇన్వాల్ అయ్యే సినిమాలు కూడా చూస్తాను. ఈ ‘విడుదల’ సినిమాను రెండు పార్టులుగా చేశారు. విజయ్ సేతుపతికి మొదటి భాగం స్క్రీన్ స్పేస్ తక్కువ. పార్ట్ 2లో ఆయన పూర్తిగా ఉంటారు. ఇది చాలా గొప్ప సినిమా. ఇటువంటి సినిమాను మీడియానే ప్రజల వద్దకు తీసుకెళ్లాలి” అని విజ్ఞప్తి చేశారు.

Exit mobile version