వెంకీ మామ షాకింగ్ లుక్… ఓల్డ్ మ్యాన్ పిక్ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు విక్టరీ వెంకటేష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతుండగా, ఆయన నటిస్తున్న సినిమాల నుంచి మేకర్స్ సర్ప్రైజ్ ట్రీట్ లతో అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నారు.ఈరోజు ఉదయం ఆయన నటిస్తున్న కామెడీ ఎంటర్టైనర్ “ఎఫ్3” నుంచి వెంకికీ సంబంధించిన చిన్న వీడియోను విడుదల చేశారు. తాజాగా వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా ఆయన మొట్టమొదటి వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’ నుండి ఫస్ట్ లుక్ ను ఆవిష్కరించారు. ఇందులో వెంకీ మామ ఓల్డ్ మ్యాన్ గా కన్పించి అందరికి షాకిచ్చాడు. పూర్తిగా నెరిసిన జుట్టు, మీసాలతో వెంకటేష్ ఎప్పటిలాగే కూల్, స్టైలిష్‌గా కన్పించాడు. నెరిసిన జుట్టు ఉన్నప్పటికీ గతంలో కంటే యవ్వనంగా, అందంగా వెంకీ మామ కన్పిస్తుండడం విశేషం.
Read also : నటి సమంతకు స్వల్ప అస్వస్థత
Also Read
వెంకటేష్ పుట్టినరోజున శుభాకాంక్షలు తెలుపుతూ నెట్‌ఫ్లిక్స్ ఇండియా సౌత్ ట్విట్టర్ హ్యాండిల్ లో ఈ చిత్రాన్ని షేర్ చేసి “ఇంతకీ ఏమొచ్చు? ఫ్రెండ్స్ తో ఉన్నా, ఫ్యామిలీతో ఉన్నా, ఒంటరిగా ఉన్నా వెంకీ మామ సినిమాలూ ఎంజాయ్ చేయడం వచ్చు. శైలి ఏదైనా, భావోద్వేగం ఏదైనా… ఒకే పేరు. పుట్టినరోజు శుభాకాంక్షలు వెంకీ మామా…” అంటూ ట్వీట్ చేశారు. దీనిని రీట్వీట్ చేస్తూ టాలీవుడ్ హల్క్ రానా “నాకు ఇది ఇష్టం… ఏదైనా జానర్, ఏదైనా ఎమోషన్, సింగిల్ నేమ్ వెంకీ” అంటూ కామెంట్ చేశారు.
కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ వర్మ దర్శకత్వం వహించిన ‘రానా నాయుడు’ ప్రముఖ అమెరికన్ టీవీ సిరీస్ ‘రే డోనోవన్’కి భారతీయ అనుకరణగా రూపొందుతోంది. అలాగే బాబాయ్ వెంకీ, అబ్బాయి రానా స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇదే తొలిసారి. దీంతో దగ్గుబాటి అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న నెట్‌ఫ్లిక్స్ వచ్చే ఏడాది నుంచి వెబ్ సిరీస్‌ను ప్రసారం చేయనుంది.
తాజావార్తలు
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!