Tollywood : సినిమాలలో అవకాశాల పేరుతో మోసం చేశారంటూ డిస్ట్రిబ్యూటర్ ఇంటి ముందు బాధితుల ధర్నా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమాలు, షార్ట్‌ఫిలిమ్స్‌లలో నటింపజేస్తామని నమ్మించి లక్షలాది రూపాయలు వసూలు చేసి మోసానికి పాల్పడిన ఘటన హైదరాబాద్‌లో జరిగింది. తమకు న్యాయం చేయాలంటూ బాధితులు అంబర్పేట్ శివం రోడ్డులోని సినిమా డిస్ట్రిబ్యూటర్ శివకుమార్ గౌడ్ ఇంటి ముందు శనివారం ఆందోళనకు దిగారు. బాధితులు ఒక్కసారిగా నిరసనకు దిగడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
బాధితుల కథనం ప్రకారం.. గత మూడేళ్లుగా శ్రీరామ్, శివకుమార్, లావణ్య అనే వ్యక్తులు ఒక ముఠాగా ఏర్పడి అవకాశాల పేరుతో అమాయకులను బురిడీ కొట్టించారు. తమకు టాలీవుడ్ లో చాలా పరిచయాలు ఉన్నాయని సినిమాల్లో మంచి పాత్రలు ఇప్పిస్తామని నమ్మించి ఒక్కొక్కరి వద్ద నుంచి సుమారు రూ. 20 లక్షల వరకు వసూలు చేశారు. ఇలా దాదాపు 25 మంది మహిళలతో పాటు పలువురి నుంచి మొత్తంగా కోట్ల రూపాయలు దండుకుని కొన్నాళ్లుగా అందుబాటులో లేకుండా తప్పించుకు తిరుగుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈ నిందితులపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనప్పటికీ వారి ప్రవర్తనలో మార్పు రాలేదని, అరెస్ట్ కాకుండా తప్పించుకు తిరుగుతున్నారని బాధితులు ఆరోపించారు. డిస్ట్రిబ్యూటర్ శివను బయటకు పిలిచి మాట్లాడించాలని, తమకు రావాల్సిన డబ్బులను వెంటనే తిరిగి ఇప్పించి బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగే వరకు ధర్నా విరమించేది లేదని స్పష్టం చేశారు.
Also Read
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
- Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
- Adarsha Kutumbam: 'ఆదర్శ కుటుంబం'.. ఆ రూమర్లు నిజమేనా?
తాజావార్తలు
-
Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
-
Droupadi Murmu: గుజరాత్ యూసీసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం.. ఏఏ నిబంధనలు అమల్లోకి వస్తాయో తెలుసా!
-
Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
-
Secunderabad Army Weapons : ఆర్మీ ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. వెబ్ సిరీస్‌లు చూసి స్కెచ్
-
World Cup 2027: 2027 ప్రపంచ కప్‌లో ‘గ్రూప్ ఆఫ్ డెత్’గా గ్రూప్ బీ.. పాపం ఆ టీమ్ పరిస్థితి ఘోరం..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!