Site icon NTV Telugu

Vicky Kaushal: ఇండియాస్ బెస్ట్ బయోపిక్… టీజర్ కి సెల్యూట్ కొట్టాల్సిందే

Vicky Kaushal

Vicky Kaushal

‘ఉరి’, ‘సర్దార్ ఉద్ధమ్’ లాంటి చిత్రాలతో మంచి విజయాలు అందుకున్నాడు యంగ్ హీరో విక్కీ కౌశల్. ఒక యాక్టర్ గా చాలా ఎవాల్వ్ అయిన విక్కీ కౌశల్… సర్దార్ ఉద్దమ్ తర్వాత మరో బయోపిక్ సినిమాతో ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. డిసెంబర్ 1న ఆడియన్స్ ముందుకి ‘సామ్ బహదూర్’ సినిమాతో రానున్నాడు విక్కీ కౌశల్. ‘మేఘ్నా గుల్జార్’ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ‘సాన్య మల్హోత్ర’, ‘ఫాతిమా సన షేక్’ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ తో ఆకట్టుకున్న ‘సామ్ బహదూర్’ చిత్ర యూనిట్, లేటెస్ట్ గా టీజర్ ని లాంచ్ చేసారు. టీజర్ లో విక్కీ కౌశల్ ని చూస్తే ‘సామ్ బహదూర్’ కళ్లకి కనిపించనంత రియల్ గా ఉన్నాడు. అతని బాడీ లాంగ్వేజ్ అండ్ డైలాగ్ డెలివరీ చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి. ఇందిరా గాంధీ, సామ్ బహదూర్ మధ్య సీన్స్ టీజర్ కి హైలైట్ గా నిలిచాయి. సింపుల్ గా చెప్పాలి అంటే ఇండియాస్ బెస్ట్ బయోపిక్ డిసెంబర్ 1న రిలీజ్ కాబోతుంది.

ఇండియన్ మిలిటరీని అయిదు యుద్ధాల్లో, నాలుగు దశాబ్దాల పాటు ముందుండి నడిపించిన “ఫీల్డ్ మార్షల్ సామ్ జంషద్ జీ మానెక్ షా” జీవితం ఆధారంగా ‘సామ్ బహదూర్’ సినిమా తెరకెక్కుతోంది. ‘బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ’ నుంచి సైన్యంలోనే ఉన్న ‘సామ్ బహదూర్’, 1971లో ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో ఇండియాని గెలిపించడంలో ముఖ్య పాత్ర పోషించారు. 9 బుల్లెట్లు శరీరంలో దిగినా యుద్ధంలో వెనకడుగు వేయని ‘సామ్ బహదూర్’ని ఇండియన్ గవర్నమెంట్ ‘పద్మ భూషణ్’, ‘పద్మ విభూషణ్’ పురస్కారాలతో సత్కరించింది. 1934 నుంచి 1973 వరకూ దేశ రక్షణలో ఉన్న ‘సామ్ బహదూర్’ 2008 జూన్ 27న మరణించారు. ఇలాంటి వ్యక్తి కథతో సినిమా చేయడం అంత ఈజీ కాదు. మరి విక్కీ కౌశల్ అండ్ టీం ‘సామ్ బహదూర్ సినిమాని’ ఎంత స్పెషల్ గా రూపొందించారో తెలియాలి అంటే డిసెంబర్ 1 వరకూ ఆగాల్సిందే.

Exit mobile version