NTV Telugu Site icon

Ravanasura: ‘ఇడియట్’ రవితేజ గుర్తొచ్చాడు బ్రో..

Raviteja

Raviteja

Ravanasura: మాస్ మహారాజా రవితేజ వరుసగా రెండు హిట్లు అందుకొని మంచి జోరు మీద ఉన్నాడు. వాల్తేరు వీరయ్య, ధమాకా రెండు మాస్ హిట్లు.. ఇక ఇదే జోరుతో తన తదుపరి సినిమాను రిలీజ్ చేయడానికి సిద్దమయ్యాడు. అదే రావణాసుర. స్వామి రారా సినిమాతో అద్భుతమైన హిట్ అందుకున్న సుధీర్ వర్మ ఈ మధ్యనే శాకినీ డాకినీ సినిమాతో ప్లాప్ ను మూటకట్టుకున్నాడు. ఇక ఈసారి ఎలాగైనా సక్సెస్ ను అందుకోవడానికి మాస్ మహారాజాతో జతకట్టాడు. ఇక ఈ చిత్రంలో రవితేజ సరసన ముగ్గురు ముద్దుగుమ్మలు మేఘా ఆకాష్, అను ఇమ్మాన్యుయేల్, ఫరియా అబ్దుల్లా నటిస్తుండగా.. హీరో సుశాంత్ ఒక కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమాలోని మరో సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

Bikini: బికినీలతో ఇంటర్నెట్ ను షేక్ చేసిన హీరోయిన్లు

వెయ్యినొక్క జిల్లాల వరకు వింటున్నాము నీ కీర్తినే అంటూ సాగిన ఈ పాట ఎంతో ఎనర్జిటిక్ గా ఉంది. రవితేజ, మేఘా ఆకాష్ మధ్య ఈ సాంగ్ నడిచింది. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించిన ఈ సాంగ్ కు దివంగత గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి లిరిక్స్ అందించడం విశేషం. ఒక అమ్మాయి అందాన్ని ఒక పక్క పొగుడుతూనే.. ఇంకోపక్క అబ్బాయి తన ప్రేమను వెల్లడిస్తున్నాడు. ఇక ఎప్పటిలాగానే రవితేజ మాస్ ఎనర్జీ పీక్స్. ముఖ్యంగా ఆ స్టెప్స్.. క్యాస్టూమ్స్ అయితే ఇడియట్ లో రవితేజ గుర్తొచ్చాడు. ఈ పాట కూడా అచ్చు గుద్దినట్లు ఇడియట్ లోని చూపులతో గుచ్చి చంపకే సాంగ్ లానే అనిపించడం గమనార్హం. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. ఇకపోతే ఈ సినిమా ఏప్రిల్ 7 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో మాస్ మహారాజా మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంటాడేమో చూడాలి.

Veyyinokka Lyrical | Ravanasura | Ravi Teja, Megha Akash | Harshavardhan Rameshwar | Sudheer Varma