Site icon NTV Telugu

Vethika Ninnila: వెతికా నిన్నిలా.. క‌నుపాప‌ల్లో క‌ల‌లా అంటున్న రక్షిత్ అట్లూరి

Vethika Ninnila Update

Vethika Ninnila Update

Vethika Ninnila song from Sasivadane Released: ‘పలాస 1978’ ఫేం రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ‘శశివదనే’ సినిమాను గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్ కంపెనీ, ఎస్.వి.ఎస్.స్టూడియోస్ బ్యానర్స్‌పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల నిర్మిస్తున్నారు. గోదావరి నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సాయి మోహన్ ఉబ్బర దర్శకత్వం వ‌హించగా ఏప్రిల్ 19న ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఒక సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘వెతికా నిన్నిలా.. క‌నుపాప‌ల్లో క‌ల‌లా, వెతికా నిన్నిలా.. వెతికా వెతికా…’’ అంటూ స‌త్య‌యామిని స్వ‌రం నుంచి వినిపించే పాట విన‌గానే ఆక‌ట్టుకునెలా ఉంది. హీరో, హీరోయిన్‌కి మ‌ధ్య అనుకోకుండా ఎడ‌బాటు వ‌చ్చింద‌ని, అత‌ని కోసం ఆమె త‌ప‌న ప‌డింద‌ని ఈ పాట‌ను విన్న‌వారికి ఎవ‌రికైనా ఇట్టే అర్థ‌మైపోతుంది.

Salaar 2 Update: ‘సలార్‌2’ గురించి బిగ్ అప్‌డేట్‌ ఇచ్చిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌!

వెతికా నిన్నిలా.. క‌నుపాప‌ల్లో క‌ల‌లా… అంటూ సాగే హుక్ లైన్ ఈ పాట‌ను మ‌ళ్లీ మ‌ళ్లీ వినాల‌నిపించేలా చేస్తుంద‌ని అంటున్నారు శ‌శివ‌ద‌నే మేక‌ర్స్. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు విడుదలైన ‘శశివదనే..’, ‘డీజే పిల్లా..’, గోదారి అటువైపో.. పాట‌ల‌కు ట్రెమెండెస్ రెస్పాన్స్ రాగా రీసెంట్‌గా విడుదలైన టీజర్‌కు సైతం అమేజింగ్ స్పంద‌న‌ వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి వెతికా నిన్నిలా…’ పాటను మేకర్స్ విడుదల చేశారు. శ‌ర‌వ‌ణ భాస్క‌ర‌న్‌ సంగీతం అందించిన ఈ పాట‌ను స‌త్య యామిని పాడారు. కిట్టూ విస్సాప్రగడ లిరిక్స్ రాశారు. శరవణన్ వాసుదేవన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి అనుదీప్ దేవ్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. శ్రీసాయికుమార్ దారా సినిమాటోగ్రాఫర్‌గా, ఎడిటర్‌గా గ్యారీ బి.హెచ్ వర్క్ చేస్తున్నారు. ఇక సినిమాలో రక్షిత్ అట్లూరి, కోమలీ, శ్రీమన్, దీపక్ ప్రిన్స్, జబర్దస్త్ బాబీ, రంగస్థలం మహేష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Exit mobile version