NTV Telugu Site icon

Milind Safai: బ్రేకింగ్.. నేషనల్ అవార్డ్స్ పండగ వేళ విషాదం.. క్యాన్సర్ తో నటుడు మృతి

Milind

Milind

Milind Safai: 69 వ నేషనల్ అవార్డ్స్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెల్సిందే. అన్నిభాషల్లో మంచి సినిమాలను గుర్తించి.. వారి ప్రతిభకు అవార్డ్స్ ను అందజేస్తున్నారు. ఇక నేషనల్ అవార్డ్స్ ప్రకటన రావడంతో ప్రతి ఇండస్ట్రీలో పండుగ వాతావరణం నెలకొంది. సినీ అభిమానులు దగ్గరనుంచి సినీ, రాజకీయ ప్రముఖులు విన్నర్స్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇలా ఏ పండుగ వాతావరణంలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మరాఠీ నటుడు క్యాన్సర్ తో కన్నుమూయడంతో మరాఠీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రముఖ మరాఠీ నటుడు మిలింద్ సఫాయ్(53) శుక్రవారం ఉదయం కన్నుమూశారు. గత కొన్నేళ్లుగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన.. నేటి ఉదయం మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Rashmi Gautham: హాట్ టీచర్.. హాట్ సీన్స్.. బాగా గట్టిగా ఇచ్చారట.. ?

ఆయ్ కుతే కే కర్తే అనే సీరియల్ ద్వార మిలింద్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక సీరియల్స్ మాత్రమే కాకుండా.. ఎన్నో సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ లో నటించి మెప్పించాడు. మేకప్, థాంక్ యు విఠలా, పోస్టర్ బాయ్స్, చడీ లగే చమ్ చమ్, ప్రేమచి గోష్టా, టార్గెట్, బి పాజిటివ్ లాంటి సినిమాలు ఆయనకు మంచిపేరును తెచ్చి పెట్టాయి. ఇక ఈ విషయం తెలియడంతో అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయన ఎంతో మంచి నటుడు అని.. ఆయన చిన్న వయస్సులోనే చనిపోవడం బాధాకరమని సినీ ప్రముఖులు చెప్పుకొస్తున్నారు. అంతేకాకుండా నేషనల్ అవార్డ్స్ పండుగ వేళ ఇలా జరగడం ఎంతో బాధాకరమని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.

Show comments