ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. సీనియర్ నటి కేపీఏసీ లలిత మంగళవారం త్రిపుణితురలో తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. ఈ లెజెండరీ నటి ఒకప్పుడు మలయాళం సినిమా కమర్షియల్ అండ్ ఆర్ట్ స్కూల్ రెండింటిలోనూ బాగా రాణించింది. కేపీఏసీ లలిత అసలు పేరు మహేశ్వరి అమ్మ. ఆమె చాలా సంవత్సరాలు సినిమా పరిశ్రమలో పని చేశారు. ఆమె ఐదు దశాబ్దాల కెరీర్‌లో 550కి పైగా చిత్రాల్లో నటించింది. ఆమె తీవ్ర అనారోగ్యానికి గురయ్యే వరకు కేరళ సంగీత నాటక అకాడమీ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. ఆమె ఉత్తమ సహాయ విభాగంలో రెండు జాతీయ అవార్డులు, నాలుగు రాష్ట్ర అవార్డులను గెలుచుకుంది.
Read Also : Chiranjeevi and Sukumar : మెగా ఫోన్ పట్టబోతున్న క్రియేటివ్ డైరెక్టర్
ఆమె దివంగత మలయాళ చిత్రనిర్మాత భరతన్‌ను వివాహం చేసుకుంది. వారికి ఇద్దరు పిల్లలు… కుమారుడు సిద్ధార్థ్ భరతన్, దర్శకుడు, ఆమె కుమార్తె శ్రీకుట్టి భరతన్. లలిత మరణ వార్త సౌత్ ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురి చేసింది. అనేక మంది సెలబ్రిటీలు తమ సోషల్ మీడియా ద్వారా తమ హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తూ నివాళులర్పించారు. నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఆమె మృతిపై “రెస్ట్ ఇన్ పీస్ లలితా ఆంటీ! మీతో వెండితెరను పంచుకోవడం ఒక అదృష్టం! నాకు తెలిసిన అత్యుత్తమ నటుల్లో ఒకరు. #KPACLalitha” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కీర్తి సురేష్, మంజూ వారియర్ కూడా లెజెండరీ నటి మృతితో ఆమెను తలచుకుని భావోద్వేగ పోస్ట్ రాశారు.