Site icon NTV Telugu

Actor Rajesh : చిత్రసీమలో మరో విషాదం… కన్నడ కళాతపస్వి కన్నుమూత

Rajesh

చిత్రపరిశ్రమలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ప్రముఖ సీనియర్ నటుడు రాజేష్ మరణంతో కన్నడ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ఆయనను శాండల్ వుడ్ లో కళా తపస్వి అని కూడా పిలుస్తారు. వయస్సు సంబంధిత సమస్యల కారణంగా 89 ఏళ్ళ వయసులో ఉన్న ఆయన ఆసుపత్రిలో కన్నుమూశారు. రాజేష్ ఫిబ్రవరి 9 నుండి వృద్ధాప్య సంబంధిత వ్యాధుల కారణంగా బెంగుళూరులోని ఓ ఆసుపత్రి చేరి చికిత్స పొందుతున్నాడు. నిన్న ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్రిటికల్ గా మారింది. డాక్టర్లు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఆయనను బ్రతికించలేకపోయారు. అర్ధరాత్రి 2:30 గంటలకు రాజేష్ తుది శ్వాస విడిచినట్టు సమాచారం. ఇక రాజేష్ భౌతికకాయాన్ని సాయంత్రం వరకు ఆయన విద్యారణ్యపుర నివాసంలో ఉంచి నివాళులర్పిస్తారు. ఈరోజు సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నారు.

Read Also : NBK107 : పిక్ లీక్… టాక్ ఆఫ్ టౌన్ గా బాలయ్య కొత్త లుక్

రాజేష్‌కు దక్షిణాది నటుడు అర్జున్ సర్జాను వివాహం చేసుకున్న నటి ఆశారాణితో సహా ఐదుగురు పిల్లలు ఉన్నారు. రాజేష్ స్టేజ్ ఆర్టిస్ట్‌గా సినిమా కెరీర్ ను ప్రారంభించాడు. 1964లో కన్నడ చిత్రం “వీర సంకల్ప”తో వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చారు. 1968లో విడుదలైన “నమ్మ ఊరు” ఆయన కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ఈ సినిమా ఇచ్చిన బ్లాక్‌బస్టర్ హిట్‌ తో ఆయన ఫేట్ మారిపోయింది. రాజేష్ 1960ల చివరలో, 1970ల ప్రారంభంలో అనేక చిత్రాలలో కథానాయకుడిగా కన్పించారు. కానీ ఆ తర్వాత క్యారెక్టర్ రోల్స్‌లో కన్పించారు. రాజేష్ తన 45 ఏళ్ల సినీ కెరీర్‌లో 150కి పైగా చిత్రాల్లో నటించారు. ఆయన జీవిత చరిత్ర “కళా తపస్వి రాజేష్ ఆత్మకథే” 2014లో వచ్చింది.

Exit mobile version