Site icon NTV Telugu

Nani Birthday ode: నాని పుట్టినరోజు… స్వయంగా కవిత రాసిన నిర్మాత

Nani

Nani

Venkat Boyanapalli pens a sweet note to the Natural Star Nani on his birthday: అసలు ఏమాత్రం సినిమా బ్యాక్ గ్రౌండ్ లేని ఘంటా నవీన్ కుమార్ సినిమాల మీద పిచ్చితో ఏదో ఒక విభాగంలో పని చేయాలని హైదరాబాద్ వచ్చేశాడు. అలా హైదరాబాద్ వచ్చిన యువకుడు రేడియో జాకీ అయ్యాడు. తర్వాత ఒక పెద్ద దర్శకుడు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తే పరిచయాలు పెరుగుతాయని భావించి రాధా గోపాలం అనే సినిమాకి బాపూ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యాడు. ఆ తర్వాత స్నేహితుల ద్వారా వచ్చిన అవకాశంతో అష్టాచమ్మా అనే సినిమాలో హీరో అయి తెలుగు వారందరికీ దగ్గరయిపోయాడు. చూడగానే పక్కింటి అబ్బాయిలాగా అనిపించే అతన్ని తెలుగు వారందరూ గుండెల్లో పెట్టుకుని నేచురల్ స్టార్ నానిని చేశారు. ఒకప్పుడు యూత్ ఫుల్ సినిమాలు లవ్ స్టోరీస్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ వచ్చిన నాని ఇప్పుడు విభిన్నమైన సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

Teja Sajja: కంటెంటే కింగు.. మిగతావన్నీ తర్వాతేనంటున్న తేజ సజ్జా

అయితే ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తున్న సరి పోదా శనివారం సినిమా నుంచి ఒక గ్లింప్స్ రిలీజ్ చేయడమే కాక సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు మేకర్స్. అయితే ఆసక్తికరమైన అంశం ఏమిటంటే నాని హీరోగా శ్యామ్ సింగరాయ్ సినిమా నిర్మించిన నిర్మాత వెంకట్ బోయినపల్లి నానిని ఉద్దేశించి ఒక కవిత రాసి సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. తనకు నాని చాలా మంచి మిత్రుడు అని చెబుతూ తనకు ఒక గైడ్ లాగా ఆయన వ్యవహరిస్తూ ఉంటారని ఈ సందర్భంగా వెంకట్ చెప్పుకొచ్చారు. అలాంటి నానికి పుట్టినరోజులు మరిన్ని రావాలని ఇంకా మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆయన కోరుతున్నారు. ఈరోజు చాలా స్పెషల్ అని చెబుతూ తమకు మంచి బ్లాక్ బస్టర్ బిగినింగ్ ఇచ్చినందుకు ఎప్పటికీ రుణపడి ఉంటామని ఈ మ్యాజిక్ కలిసి మరోసారి క్రియేట్ చేయాలని కోరుకుంటున్నాము అని చెప్పుకొచ్చారు. మొత్తం మీద ఇలా స్వయంగా ఒక హీరోకి నిర్మాత కవిత రూపంలో విషెస్ చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది.

Exit mobile version