NTV Telugu Site icon

Veera Simha Reddy: బాలయ్య మాస్ కి తలొంచిన ఓవర్సీస్ బాక్సాఫీస్

Veera Simha Reddy

Veera Simha Reddy

నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీర సింహా రెడ్డి’ సినిమా ఒక రెగ్యులర్ మాస్ మసాలా ఫ్యాక్షన్ డ్రామా సినిమా. హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్, పొలిటికల్ పంచ్ లైన్స్ ఎక్కువగా ఉండే సినిమా వీర సింహా రెడ్డి అనే విషయం అందరికీ తెలుసు. మాములుగా ఇలాంటి సినిమాలు బీ, సీ సెంటర్స్ లో మాత్రమే ఆడుతాయి. మాస్ ఆడియన్స్ ఎక్కువగా ఉండే ఆ సెంటర్స్ ని టార్గెట్ చేసే మాస్ సినిమాలు ఎక్కువగా వస్తుంటాయి. అయితే బాలయ్య ఇందుకు పూర్తిగా భిన్నంగా కనిపిస్తున్నాడు. ఆయన మాస్ సినిమా చేసినా, పొలిటికల్ డైలాగ్స్ చెప్పినా, యాంటి గ్రావిటీ ఫైట్స్ చేసినా సెంటర్స్ తో తేడా లేకుండా ప్రతి ఒక్కరూ బాలయ్య సినిమా చూస్తారు. ఏ సెంటర్, మల్టీప్లెక్స్, బీ, సీ ఇలా పతి చోటా బాలయ్య సినిమాకి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో బాలయ్య హవా ఎలా ఉన్నా ఓవర్సీస్ లో మాత్రం ఆయన సినిమాలు ఎప్పుడూ కాస్త వీక్ గానే కనిపిస్తాయి.

ఈ వీక్ జోన్ లో కూడా బాలయ్య ర్యాంపేజ్ చూపించగలడు అని నిరూపించిన సినిమా ‘అఖండ’. బోయపాటి డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఓవర్సీస్ లో మిలియన్ మార్క్ ని దాటి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అదే ట్రెండ్ లో ఇప్పుడు వీర సింహా రెడ్డి సినిమా కూడా ఓవర్సీస్ లో సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబడుతోంది. ప్రీమియర్స్ నుంచి స్ట్రాంగ్ కలెక్షన్స్ ని రాబడుతున్న వీర సింహా రెడ్డి సినిమా, వాల్తేరు వీరయ్య తర్వాత కాస్త డౌన్ అయ్యింది. థియేటర్స్ కౌంట్ కూడా తగ్గడంతో వీర సింహా రెడ్డి కలెక్షన్స్ లో డ్రాప్ కనిపిస్తోంది. డౌన్ ట్రెండ్ లో కూడా వీర సింహా రెడ్డి సినిమా మిలియన్ మార్క్ ని టచ్ చేసింది. మండే వరకూ హాలీడేస్ ఉన్నాయి కాబట్టి వీర సింహా రెడ్డి లాంగ్ రన్ లో అఖండ ఓవర్సీస్ కలెక్షన్స్ ని బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది. ఒక ఫ్యాక్షన్ సినిమాతో కూడా ఓవర్సీస్ మార్కెట్ ని షేక్ చెయ్యడం బాలయ్యకి మాత్రమే సాధ్యమయ్యింది.