NTV Telugu Site icon

Ponniyin Selvan 2: రెహమాన్ కంపోజిషన్ కి సలాం కొట్టాల్సిందే

Ponniyin Selvan 2

Ponniyin Selvan 2

మూవీ మేకింగ్ మాస్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్ ఫ్రాంచైజ్ నుంచి సెకండ్ పార్ట్ రిలీజ్ కావడానికి రెడీగా ఉంది. పొన్నియిన్ సెల్వన్ 2, PS-2 అనే టైటిల్స్ తో ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 28న రిలీజ్ కానున్న ఈ మూవీ వెయ్యి కోట్ల బెంచ్ మార్క్ ని టార్గెట్ చేసింది. మొదటి పార్ట్ పొన్నియిన్ సెల్వన్ 500 కోట్లు రాబట్టింది కానీ ఈ కలెక్షన్స్ తమిళులు ఉన్న ప్రాంతానికి మాత్రమే పరిమితం అయ్యాయి. ఇతర ప్రాంతాల్లో పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 ఆశించిన స్థాయిలో ప్రేక్షకులని మెప్పించలేకపోయింది. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి కానీ అన్నింటికన్నా ముఖ్య కారణం సినిమాలో తమిళ నేటివిటీ ఎక్కువ ఉండడం. చోళ రోజుల కథ చూస్తూ తమిళ నేటివిటీ ఉండకూడదు అనుకోవడం అవగాహనరాహిత్యం అనే అనుకోవాలి.తమిళ నేలపై కొన్ని వందల ఏళ్ల క్రితం జరిగిన, ఒక గొప్ప భారతీయ కథగా పొన్నియిన్ సెల్వన్ సినిమాలని చూడాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఆ కథకి అన్ని సెంటర్స్ లో రీచ్ దొరుకుంతుంది. పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 చూడకున్నా పార్ట్ 2 అర్ధమవుతుంది అని మణిరత్నం ఇప్పటికే స్టేట్మెంట్ ఇచ్చాడు కాబట్టి మరి సాలిడ్ ప్రమోషన్స్ ని చేస్తే పాన్ ఇండియా మొత్తం పొన్నియిన్ సెల్వన్ 2 సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత లాంగ్ రన్ ని బట్టి PS-2 ఫైనల్ రన్ ఎక్కడి వరకూ వచ్చి ఆగుతుంది అనే విషయం అర్ధమవుతుంది.

ఇప్పటికే టీజర్, సాంగ్స్, ట్రైలర్ తో PS-2 పై అంచనాలు పెంచిన చిత్ర యూనిట్, లేటెస్ట్ గా ‘వీర రాజ వీర’ సాంగ్ లిరికల్ వీడియోని రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ని రెహమాన్ డిజైన్ చేసిన విధానం, ఆ సౌండ్ డీటెయిలింగ్, ఆర్కెస్ట్రా డిజైన్ కి ఎవరైనా సలాం కొట్టాల్సిందే. సౌండింగ్ ఎట్ ఇట్స్ బెస్ట్ అనిపించేలా కంపోజ్ చేసిన రెహమాన్, బ్యూటీఫుల్ సౌండ్ మిక్సింగ్ ఇచ్చాడు. సాంగ్ లో చాలా లేయర్స్, చాలా ఇన్స్ట్రూమెంటేషన్ యూసేజ్ వినిపిస్తోంది. అందుకే ఇప్పటివరకూ పొన్నియిన్ సెల్వన్ నుంచి వచ్చిన అన్ని సాంగ్స్ కన్నా ఈ ‘వీర రాజ వీర’ సాంగ్ చాలా స్పెషల్ గా నిలిచింది. చంద్రబోస్ రాసిన లిరిక్స్ ని కరెక్ట్ గా వింటే గూస్ బంప్స్ రావడం గ్యారెంటీ.

ముఖ్యంగా మూడున్నర నిమిషాల దగ్గర “మగసిరి కండ చూసి, కడిలికి చెమట పోయు… పదునగు కట్టి చూసి, నింగికి నిదురరాదు… రగతము పొంగి పారి, నదులకు రంగుమారు… తెగిపడు తలలు అన్నీ, అలలకు అన్నమౌను… పులివలె దూకుతుంటే, జగములు జిన్కలౌను… నిన్నిక పొగడమంటే, భాషకు శ్వాస ఆగు… విధిగా తెగించేయ్ రా, విధినే వధించేయ్ రా… విలయం ధరించేయ్ రా, విజయం వరించే రా…” అంటూ చంద్రబోస్ రాసిన లిరిక్స్ అరుణ్ మొలి క్యారెక్టర్ శక్తి సామర్ధ్యాలని చెప్తున్నట్లు ఉన్నాయి. ఈ లిరిక్స్ ని చిన్మయి, మహదేవన్ అద్భుతంగా పాడారు. సాంగ్ లో జయం రవి, శోభిత కనిపించారు. ఈ సాంగ్ కొన్ని రోజుల పాటు ట్రెండ్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

Show comments