NTV Telugu Site icon

Real Story: ‘వీరఖడ్గం’ చేతపట్టిన సృష్టి డాంగే!

Veera

Veera

Veera Khadgam: ఎం.ఎ. చౌదరి దర్శకత్వంలో కె. కోటేశ్వరరావు నిర్మించిన చిత్రం ‘వీరఖడ్గం’. సృష్టి డాంగే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి మారుశెట్టి సునీల్ కుమార్ లైన్ ప్రొడ్యూస‌ర్‌ గా వ్యవహరిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి మూడోవారంలో విడుదల కాబోతోంది. ఈ సందర్బంగా చిత్ర బృందం మీడియాతో మాట్లాడింది. తొలుత ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన నిర్మాత మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ, ”ద‌ర్శ‌కుడు ఎమ్ ఏ చౌద‌రి ప్ర‌తిభావంతుడు. చాలా కాలంగా తెలుసు. పాట‌లు బావున్నాయి. ఈ సినిమా విజ‌య‌వంత‌మై ప‌ని చేసిన ప్ర‌తి ఒక్క‌రికీ మంచి పేరు రావాల‌ని కోరుకుంటున్నాను” అని అన్నారు. దర్శకుడు చౌదరి మాట్లాడుతూ, ”చరిత్ర శిథలమైనా, దాని మూలాలు ఎక్కడో ఒక చోట మిగిలే ఉంటాయి. పగ కూడా అంతే. ఒక మనిషిని నాశనం చెయ్యాలి అనుకుంటే ఎన్ని జన్మలైనా సరే దాన్ని సాధించే వరకు మనిషి జీవితం మసి అయినా, ఆ శవమే మృగమై వెంటాడుతుంది. గ్రాఫిక్స్ కి ప్రాధాన్య‌త ఉన్న చిత్ర‌మిది. షాయ‌క్ ప‌ర్వేజ్ ఈ సినిమాకు మంచి సంగీతాన్ని స‌మ‌కూర్చాడు” అని అన్నారు.

లైన్ ప్రొడ్యూస‌ర్ మారుశెట్టి సునీల్ కుమార్ మాట్లాడుతూ, ”నిర్మాతగా నేను `రెండో కృష్ణుడు` అనే సినిమా తీశాను. ఆ త‌ర్వాత ఎమ్ఏ చౌద‌రి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ”ఇంద్రాణి, చిలిపికృష్ణుడు” చిత్రాల‌కు ఫైనాన్సియ‌ర్ గా చేశాను. క‌థ న‌చ్చి `వీర‌ఖ‌డ్గం` చిత్రానికి లైన్ ప్రొడ్యూస‌ర్ గా వ్యవహరించాను. సినిమా చాలా బాగా వ‌చ్చింది. ప్రేక్ష‌కులు మాచిత్రాన్ని ఆద‌రిస్తార‌ని నమ్ముతున్నాను” అని అన్నారు. తెలంగాణ ఫిలిం ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ ఛైర్మ‌న్ ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్ తాను సినిమా చూశానని చాలా బాగుందని కితాబిచ్చారు. ఇందులో నాలుగు పాటలున్నాయని, 300 సంవత్సరాల క్రితం పార్వతీపురంలో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారని సంగీత దర్శకుడు షాయక్ పర్వేజ్ తెలిపారు. బ్రహ్మానందం, సత్యప్రకాష్ , ఆనంద్ రాజ్, మదన్, తపస్వి, అపూర్వ, పృద్విరాజ్, టార్జన్, ధనరాజ్, తాగుబోతు రమేష్, చలపతి రావు తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఘటికాచలం సంభాషణలు సమకూర్చారు.

Show comments