కింగ్ నాగార్జున ఇటీవల తన తదుపరి చిత్రం ‘బంగార్రాజు’ షూటింగ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. రాబోయే ఈ రొమాంటిక్ డ్రామాలో నాగ చైతన్య, రమ్య కృష్ణ, కృతి శెట్టి కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. నాగార్జున, నాగ చైతన్య గతంలో ‘మనం’, ‘ప్రేమమ్’ వంటి చిత్రాలలో నటించారు. కళ్యాణ్ కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. 2016లో విడుదలైన “సోగ్గాడే చిన్ని నాయన” చిత్రానికి ఈ మూవీ సీక్వెల్ గా రూపొందుతోంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాలో నాగార్జున ఏకంగా ముగ్గురు ముద్దుగుమ్మలతో ఓ రొమాంటిక్ సాంగ్ చేయబోతున్నాడు.
Read Also : అనుకున్న సమయానికే “కేజిఎఫ్-2”
దుమ్ముదులిపే ఈ సాంగ్ కోసం ‘బంగార్రాజు’ మేకర్స్ ఇద్దరు నటీమణులు వేదిక, మీనాక్షి చౌదరిని ఎంపిక చేసినట్టు సమాచారం. ఈ చిత్రంలో మరింత గ్లామర్ ను జోడించడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు కన్పిస్తోంది. ఇక ఈ సాంగ్ లో నాగార్జున, నాగ చైతన్య ఇద్దరూ కలిసి స్టెప్పులేయనున్నారు. త్వరలో ‘బంగార్రాజు’ బృందం ఈ ఐటమ్ సాంగ్ కోసం ఒక ప్రత్యేక సెట్‌ను ఏర్పాటు చేయనుంది.
మరోవైపు నాగార్జున త్వరలో బాలీవుడ్ చిత్రం ‘బ్రహ్మాస్త్ర’లో కనిపించనున్నాడు. ఇందులో ఆయన అతిధి పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో రణబీర్ కపూర్, అలియా భట్ ప్రధాన పాత్రల్లో నటించారు. మరోవైపు నాగార్జున అతను ప్రవీణ్ సత్తారుతో కలిసి “ది ఘోస్ట్” సినిమాలో నటిస్తున్నాడు.
