Site icon NTV Telugu

Fear: భయపెట్టేలా వేదిక “ఫియర్” ఫస్ట్ లుక్ పోస్టర్

Vedhika Fear

Vedhika Fear

Vedhika’s Suspense Thriller “Fear” First Look : హీరోయిన్ వేదిక లీడ్ రోల్ లో నటిస్తున్న తాజా చిత్రం “ఫియర్”. దత్తాత్రేయ మీడియా బ్యానర్ పై ప్రొడ్యూసర్ ఏఆర్ అభి నిర్మిస్తున్న ఈ సినిమాకి సుజాత రెడ్డి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ కథతో దర్శకురాలు Dr. హరిత గోగినేని ఫియర్ మూవీని రూపొందిస్తుండగా హీరో అరవింద్ కృష్ణ ఓ స్పెషల్ రోల్ లో కనిపించనున్నారు. “ఫియర్” సినిమా విడుదలకు ముందే వివిధ అంతర్జాతీయ ప్రతిష్టాత్మక ఫిలిం ఫెస్టివల్స్ లో 60 కి పైగా అవార్డ్స్ లను గెల్చుకుని కొత్త రికార్డ్ క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. ఇక తాజాగా ఈ రోజు “ఫియర్” సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను స్టార్ డైరెక్టర్, కొరియోగ్రాఫర్ ప్రభుదేవా సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు.

DGL : నాలుగేళ్లకు సినిమా అనౌన్స్ చేసిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ డైరెక్టర్

ఫస్ట్ లుక్ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది అని పేర్కొన్న ఆయన చిత్ర యూనిట్ కు బెస్ట్ విశెస్ అందజేశారు. ఒక చీకటి గదిలో హీరోయిన్ భయపడుతూ చూస్తున్న స్టిల్ తో డిజైన్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్ కథతో రూపొందిన “ఫియర్” సినిమా త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. వేదిక, అరవింద్ కృష్ణ, జెపి ( జయప్రకాష్ ), పవిత్ర లొకేష్, అనీష్ కురువిల్ల, సాయాజి షిండే, సత్య కృష్ణ, సాహితి దాసరి, షాని తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి ఐ ఆండ్రూ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

Exit mobile version