NTV Telugu Site icon

Asvins: నిమిషమున్నర టీజర్ తోనే భయపెట్టారు మావా…

Ashvins

Ashvins

కోలీవుడ్ లో మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు ‘వసంత్ రవి’. ఈ హీరో నటించిన ‘రాకీ’ మూవీ సూపర్ హిట్ అయ్యి మోడరన్ క్లాసిక్ స్టేటస్ అందుకుంది. మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చిన వసంత్ రవి ప్రస్తుతం జైలర్ సినిమాలో నటిస్తున్నాడు. రజినీకాంత్ హీరోగా నటిస్తున్న ఈ మూవీలో రాకీ ఒక స్పెషల్ రోల్ ప్లే చేస్తున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్న జైలర్ సినిమా కన్నా ముందే తెలుగు ఆడియన్స్ ముందుకి రానున్నాడు వసంత్ రవి. SVCC బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తున్న తెలుగు, తమిళ సినిమా ‘ఆశ్విన్స్’తో రాకీ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. తరుణ్ తేజ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో విమలా రామన్, సిమ్రాన్ పరేక్ కీ రోల్స్ లో నటిస్తున్నారు. హారర్ జనార్ లో ఆశ్విన్స్ సినిమా తెరకెక్కింది.

వసంత్ రవి ఏ సినిమా చేసినా అందులో మంచి కథ ఉంటుంది అనే నమ్మకం ప్రతి ఒక్కరిలో ఉంది, ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ ఆశ్విన్స్ టీజర్ బయటకి వచ్చింది. నిమిషమున్నర నిడివితో బయటకి వచ్చిన ఆశ్విన్స్ టీజర్ ప్రతి ఫ్రేమ్ లో భయపెట్టింది. హారర్ సినిమాని పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే కలర్ టోన్ తో, వసంత్ రవి టెర్రిఫిక్ పెర్ఫార్మెన్స్ తో టీజర్ ఆకట్టుకుంది. టీజర్ కి విజయ్ సిద్ధార్థ్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంప్రెసివ్ గా ఉంది. పురాణాల నుంచి అశ్వినీ దేవతలని తీసుకోని ‘ఆశ్విన్స్’ సినిమాకి లింక్ చేసినట్లు ఉన్నారు. ఈ పాయింట్ ని రివీల్ చెయ్యలేదు కానీ టీజర్ లో చాలా చోట్ల అశ్వినీ దేవతల విగ్రహాలు కనిపించాయి. మరి వీటికీ, ఆశ్విన్స్ సినిమాకి లింక్ ఏంటి అనేది తెలియాలి అంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకూ వెయిట్ చెయ్యాల్సిందే.

Show comments