VarunTej – lavanya celebrated new beginnings in a Bachelor Party: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిల జంట త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇంకా అధికారికంగా వెల్లడించలేదు కానీ నవంబర్ 1న వీరిద్దరికీ పెళ్లి జరిగే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఇరు కుటుంబాల సభ్యులు పెళ్లి పనులు కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నట్లు చెబుతున్నారు. మొన్నీమధ్య మెగా ఫ్యామిలీ అంతా కలిసి వరుణ్ తేజ్ ప్రీ వెడ్డింగ్ పార్టీని జరుపుకోగా ఈ వేడుకకు చిరంజీవి దంపతులు, రామ్ చరణ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్, సాయి తేజ్ తదితరులు హాజరయ్యారు. ఇక ఇప్పుడు బ్యాచిలర్ పార్టీ జరిగినట్లు తెలుస్తోంది. ఈ పార్టీకి మెగా హీరోలు సహా టాలీవుడ్ నుంచి కేవలం నితిన్ అలాగే హీరోయిన్ల నుంచి కేవలం రీతూ వర్మ మాత్రమే హాజరయ్యారు.
Indraja: హీరోయిన్ గా ఇంద్రజ.. ఈ వయసులో కూడా తగ్గకుండా!
ఈ వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్, నాగబాబు సహా అల్లు అర్జున్, అల్లు స్నేహ, అల్లు అర్హ, అల్లు అయాన్ష్ పాల్గొన్నారు. ఈ క్రమంలో చిరంజీవి కాబోయే జంట చేత కేక్ కటింగ్ చేయించి ఆశీర్వదించారు. ఇక మరో పక్క ఈ వేడుకలకు పంజా సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్, నిహారిక అలాగే మెగా హీరోలతో పాటు నితిన్ అలాగే ఆయన భార్య షాలిని కూడా హాజరయ్యారు. అంతేకాదు హీరోయిన్ల నుంచి కేవలం రీతూ వర్మ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఇక వీరి వివాహ వేడుకలు ఇటలీలోని టుస్కాన్ లో జరగనున్నట్టు చెబుతున్నారు. అయితే హీరో నితిన్ వరుణ్ కి సన్నిహితుడు కావడంతోనే ఆయనను మాత్రమే ఈ వేడుకలకు ఆహ్వానించారని తెలుస్తోంది. ఇక రీతూ లావణ్యకి సన్నిహితురాలు అని తెలుస్తోంది.