Tollywood Solo Release Dates Issue:తెలుగు సినీ పరిశ్రమలో కొత్తగా ఏర్పడిన సింసినిమాల గిల్ రిలీజ్ టెన్షన్ విషయంలో సినీ పెద్దలు సమావేశం అయ్యారు. సంక్రాంతి బరిలో ఉన్న సినిమా ఏదైనా తప్పుకుంటే దానికి సోలో రిలీజ్ ఇప్పిస్తామని తెలుగు ఫిలిం ఛాంబర్, తెలంగాణ ఫిలిం ఛాంబర్, తెలుగు నిర్మాతల మండలి ఆఫర్ చేశాయి. ఈ నేపథ్యంలో రవితేజ హీరోగా నటించిన ఈగల్ సినిమా టీం తమకు ఫిబ్రవరి 9 సింగల్ రిలీజ్ డేట్ ఇస్తే తాము సంక్రాంతి బరి నుంచి తప్పుకుంటామని పేర్కొంది ఈ నేపథ్యంలో అప్పటికప్పుడు హామీ ఇచ్చేశారు కానీ అదే రోజు రిలీజ్ పెట్టుకున్న ఊరి పేరు భైరవకోన సినిమా నిర్మాతలను మాత్రం సంప్రదించలేదు. వారిని సంప్రదించకపోవడంతో వారు కూడా అదే రోజు రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఈగల్ నిర్మాతలు ఫిలిం ఛాంబర్ కి లేఖ రాశారు. తమకు ఇస్తామన్న సింగిల్ రిలీజ్ డేట్ ఇచ్చేలా చూడాలని అందులో కోరారు.
Chandrababu: పాలకులను ప్రశ్నించే అధికారం ఇచ్చేది ఓటు..
ఈ నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు ఆయా సినిమాల నిర్మాతలతో సమావేశం అయ్యారు. సమావేశం అయ్యి ఫిబ్రవరి 9వ తేదీ నుంచి 16వ తేదీకి ఊరి పేరు భైరవకోన సినిమా వాయిదా వేసుకోమని కోరినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 16వ తేదీన రిలీజ్ కి సిద్ధంగా ఉన్న వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్, గోపీచంద్ భీమా సినిమాల నిర్మాతలతో మాట్లాడి ఆరోజు ఆ సినిమాలు రాకుండా చూసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు భైరవకోన నిర్మాత రాజేష్ దండాకు ప్రపోజల్ పెట్టారు. అయితే తన సినిమా రిలీజ్ చేస్తున్న అనిల్ సుంకర ప్రస్తుతానికి అమెరికాలో ఉన్నారని ఏ నిర్ణయం అయినా ఆయన తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఆయనతో సంప్రదింపులు జరిపిన తర్వాత ఒక క్లారిటీ ఇస్తామని రాజేష్ అప్డేట్ ఇచ్చినట్టు తెలుస్తోంది.. దీంతో అనిల్ సుంకర నిర్ణయం మీద ఈ సోలో రిలీజ్ డేట్ వ్యవహారం ఆధారపడి ఉంది చూడాలి మరి ఏం జరుగుతుందనేది.