మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం ఆపరేషన్ వాలంటైన్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న తొలి తెలుగు చిత్రం ఇదే. శక్తి ప్రతాప్ సింగ్ హుడా దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా రిలీజ్ టైం దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ నేడు హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. తన తనయుడు చిత్రం కావడంతో నాగబాబు కూడా హాజరయ్యారు.
ఇక ఈ ఈవెంట్ లో వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. ” నేను యాక్టర్ అవ్వడానికి కారణం.. నేను ఎవరిని చూసి ఇన్స్పిరేషన్ తీసుకుంటానో ఆయన.. ఏ విషయంలోనైనా మా ముందు డ్రైవ్ ఫోర్స్ లా ఉండే మా డాడీ మెగాస్టార్ పద్మవిభూషణ్ చిరంజీవి గారు.. ఈ ఈవెంట్ కు రావడం, మా టీమ్ ను ఆయన బ్లెస్స్ చేయడం.. మాకు ప్రపంచాన్ని గెలించనంత సంతోషంగా ఉంది. చిన్నప్పటినుంచి చిరంజీవి గారు.. మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు.. క్రమశిక్షణతో పెంచారు. కష్టాన్ని నమ్ముకొని పైకి రావాలని చెప్పేవారు. ఇలాంటి గ్రేట్ అడ్వైజ్ తో పాటు ఆయన మాకు ఇచ్చింది మీ మెగా ఫ్యాన్స్ ను. మొదటి సినిమా నుంచి ఒక మంచి సినిమా చేస్తే ఆదరిస్తామని ఎప్పుడు మాకు వెన్నుముక లా ఉన్నారు. మెగా హీరోలందరూ ఇండస్ట్రీలోకి వచ్చి ఒక సినిమ చేసాం అంటే మొదటి టికెట్ తెగేది ఒక మెగా ఫ్యాన్ దే. అది ఎప్పటికీ మారదు. అది పదేళ్లు అయినా వందేళ్లు అయినా.. నేను కిందపడినా పైకి లేచి మంచి సినిమాతో వస్తాను. నన్ను ఆదరిస్తున్నందుకు థాంక్స్.
ఇక సినిమా కోసం పనిచేసినవారందరికి థాంక్స్. మా హీరోయిన్ మానుషీ ఒంట్లో బాలేక రాలేకపోయింది. ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాము. మా చెమట, రక్తం, కన్నీళ్లు పెట్టి మరీ ఈ సినిమాకు పనిచేశాం. మొన్న ఒక మాట అన్నాను.. చిరంజీవి గారు మా గుండె అయితే.. ఆ గుండె ధైర్యం పవన్ కళ్యాణ్ గారు. మా సపోర్ట్ బాబాయ్ కు ఎప్పుడు ఒకేలా ఉంటుంది. ఎప్పటికీ ఉంటుంది. చిన్నప్పటి నుంచి మేమందరం ఒకటి అనే డాడీ పెంచారు. థాంక్యూ డాడీ .. మమ్మల్ని వాల్యూస్ తో పెంచినందుకు.. ఇక కమర్షియల్ సినిమా చేస్తున్నాను. ఈ సినిమా ఇండియన్ ఆర్మీ కోసం చేశాను. ఇక్కడ ప్రతి ఒక్కరు .. అక్కడ దేశం కోసం ప్రాణాలు అర్పిస్తున్న వారిని కుటుంబంలా అనుకోవాలి. వారు వారి కుటుంబాలను దూరం పెట్టే సైనికుల మీద నేను సినిమా చేయడం నాకు చాలా చాలా గర్వంగా ఉంది. ఇలాంటి ఎన్నో సినిమాలు మీ ముందుకు తీసుకురావాలి అని కోరుకుంటున్నాను” అని చెప్పుకొచ్చాడు.
