Site icon NTV Telugu

Varun Tej: పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రత్యేక పూజలు

Varun Tej Pooja

Varun Tej Pooja

Varun Tej Special Poojas at Pithapuram: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి తెలుగుదేశం – బిజెపితో కలిసి కూటమి ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆయన పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. ఇప్పటికే ఆయనను గెలిపించాలని కోరుతూ జనసేన పార్టీ తరఫున సినీ నటులు, టెక్నీషియన్లు కొంతమంది ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు వారికి తోడుగా ఈరోజు మెగా హీరో వరుణ్ తేజ్ కూడా ప్రచారంలో పాల్గొనబోతున్నారు. ఈ ప్రచారంలో పాల్గొనేందుకు ఈ ఉదయమే వరుణ్ తేజ్ విమానంలో రాజమండ్రి చేరుకొని అక్కడి నుంచి పిఠాపురానికి వెళ్లారు. ఇక పిఠాపురంలో కుక్కుటేశ్వర స్వామిని హీరో వరుణ్ తేజ్ దర్శించుకున్నారు. ఇక ఈ రోజు తన తల్లి పద్మజతో కలిసి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కి మద్దతుగా వరుణ్ తేజ్ ప్రచారం చేయనున్నారు. పిఠాపురం చేరుకున్న హీరో వరుణ్ తేజ్ కు జనసేన ,టిడిపి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.

Faria Abdullah: అలాంటి అబ్బాయి కావాలి.. చిట్టి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

అనంతరం పాదగయ క్షేత్రంలో కుక్కుటేశ్వర స్వామి, దత్తాత్రేయుడు, పురుహూతికా అమ్మవార్లను దర్శించుకుని నాగబాబు, వరుణ్ తేజ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక పవన్ కళ్యాణ్ కు మద్దతుగా కాసేపట్లో గొల్లప్రోలు మండలం తాటిపర్తి, కొడవలి, చందుర్తి గ్రామంలో బైక్ ర్యాలీ, రోడ్ షో లో వరుణ్ తేజ్ పాల్గొననున్నారు. సాయంత్రం దుర్గాడలో జరిగే బహిరంగ సభలో కూడా హీరో వరుణ్ తేజ్ పాల్గొననున్నారు. ఇక ప్రచారానికి మెగాస్టార్ చిరంజీవితో పాటు రామ్ చరణ్ తేజ్ కూడా వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. కానీ ఆ విషయం మీద అధికారిక సమాచారం మాత్రం లేదు. మెగాస్టార్ చిరంజీవి మే ఐదవ తేదీన పిఠాపురంలో ప్రచారం చేయబోతున్నారని ప్రచారం అయితే జరుగుతుంది. మరో ప్రచారం ప్రకారం ఆయన అప్పుడు షూటింగ్ నిమిత్తం విదేశాలకు వెళ్లబోతున్నారని పిలుస్తాను.

Exit mobile version