Varun Tej comments on Janasena Party: వరుణ్ తేజ్ హీరోగా ఆపరేషన్ వాలెంటైన్ అనే సినిమా మార్చి ఒకటవ తేదీన రిలీజ్ అవుతుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని ఈ ఉదయం లాంచ్ చేశారు. తెలుగు ట్రైలర్ ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ, లాంచ్ చేయగా హిందీ ట్రైలర్ ని సల్మాన్ ఖాన్ లాంచ్ చేశారు. ఇక అనంతరం జరిగిన ప్రెస్ మీట్ లో వరుణ్ తేజ్ పలు ఆసక్తికర ప్రశ్నలకు మరింత ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా జనసేన పార్టీకి మీ మద్దతు ఉంటుందా? అని ప్రశ్నిస్తే గతంలో తాను ప్రచారానికి కూడా వెళ్లిన విషయాన్ని గుర్తు చేసి కచ్చితంగా తన సపోర్ట్ తన బాబాయికి ఉంటుందని మరోసారి క్లారిటీ ఇచ్చారు. అయితే మెగా ఫ్యామిలీలో చాలా మంది హీరోలు ఉన్నారు.
మీరు ఒకరితో స్క్రీన్ షేర్ చేసుకోవాలి అంటే ఎవరితో షేర్ చేసుకుంటారు అని అడిగితే అందరితో షేర్ చేసుకోవాలని ఉంది కానీ బాబాయితో షేర్ చేసుకుంటే ఇంకా బాగుంటుందని తన మనసులో మాట బయటపెట్టాడు. అయితే చేసేదేదో విలన్ గా చేయొచ్చు కదా అని అడిగితే అమ్మో అలాంటి పాత్రలు చేస్తే మా అభిమానులు ఊరుకుంటారా? చంపేస్తారు కదా! అన్నట్లు ఆయన కామెంట్ చేశారు. పుల్వామా ఎటాక్ జరిగిన తర్వాత భారత్ జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ ఆధారంగా ఆపరేషన్ వాలెంటైన్ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఒక ఫైటర్ జెట్ పైలెట్ గా కనిపించబోతున్నాడు. శక్తి ప్రతాప్ సింగ్ హడ దర్శకత్వంలో ఈ సినిమా తెలుగు హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కి రిలీజ్ అవుతుంది. సోనీ పిక్చర్స్ సంస్థతో కలిసి సిద్దు, సందీప్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. మానుషి చిల్లర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నవదీప్, అలీ రజా వంటి వారు ఇతర కీలక పాత్రలలో కనిపిస్తున్నారు.