NTV Telugu Site icon

Varun Tej: మెగా ఫ్యామిలీకి ఏడాది నుంచి సరైన హిట్స్ లేవన్న జర్నలిస్ట్.. షాకింగ్ ఆన్సరిచ్చిన వరుణ్ తేజ్

Varun Tej

Varun Tej

Varun Tej Commemts on Hits and Flops of Mega Heros Movies: మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం ఆపరేషన్ వాలెంటైన్. ఈ మూవీ మార్చి 1న ప్రేక్షకుల ముందుకు పాన్ ఇండియా లెవెల్ లో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. తాజాగా మంగళవారం అనగా ఫిబ్రవరి 20న మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇక ఈ ఈవెంట్ లో సోషల్ మీడియా ఖాతాల వేదికగా తెలుగు ట్రైలర్ ను రామ్ చరణ్ చేతుల మీదుగా రిలీజ్ అయింది. హిందీ ట్రైలర్ ను బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ రిలీజ్ చేశారు. ఆపరేషన్ వాలెంటైన్ సినిమా ట్రైలర్ లో వరుణ్ తేజ్ స్టంట్స్, మానుషితో లవ్ ట్రాక్, పవర్ ఫుల్ దేశభక్తి డైలాగులు ఆకట్టుకుంటున్నాయి.

SSMB 29: ఆపరేషన్ జక్కన్న.. ఆ పని చేసి అండర్ గ్రౌండ్ లోకి మహేష్?

ఇక ఈ సినిమా ఈవెంట్ లో ఓ విలేకరి ప్రశ్నకు వరుణ్ సమాధానం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన గత సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు… మరి మీ సినిమాతో మెగా ఫ్యాన్స్ ఆకలి తీరనుందా అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు వరుణ్ తేజ్ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు. వరుణ్ తేజ్ మాట్లాడుతూ…. ”ఈ సినిమా కాదు.. ఓ సంవత్సరం సినిమా పోతే.. నెక్ట్స్ సినిమాతో ముందుకు వెళ్తునే ఉంటాం. లాస్ట్ 30 నుంచి 40 ఏళ్ల నుంచి చూస్తున్నారు. ఒక సంవత్సరం డల్ గా ఉండొచ్చు.. అది పర్లేదు.. ఏ యాక్టర్ కైనా అది రొటీన్.. అలాగే ఉంటుంది. దాని గురించి హిస్టరీ చెబుతుంది. నా వంతు ప్రయత్నం అంటారా.. నా గత రెండు సినిమాలు ఆడలేదు. బట్ కష్టపడి ఈ సినిమా చేశాము. బ్లడ్, టియర్స్ పెట్టి ఈ సినిమాను చేశాం. ఈ సినిమా కచ్చితంగా ఆడుతుందని అనుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చారు. ఈ సినిమాకు శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించగా.. మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్, సందీప్ ముద్ద సంయుక్తంగా నిర్మించారు.