NTV Telugu Site icon

Varun Tej: అత్తారింటికి బయల్దేరిన మెగా ప్రిన్స్ .. కొత్త జంటతో పాటు ఆమె కూడా

Varun

Varun

Varun Tej: మెగా ఇంట ఇంకా పెళ్లి సందడి అవ్వలేదు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే. నవంబర్ 1 న వీరి పెళ్లి ఇటలీలో చాలా కొద్దిమంది బంధుమిత్రుల మధ్య జరిగింది. ఇక ఇండియాలో నవంబర్ 5 న వీరి రిసెప్షన్ గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు టాలీవుడ్ మొత్తం తరలివచ్చింది. ఇక రిసెప్షన్ తో ఈ వేడుకలు అయిపోయాయి అని అనుకున్నారు. మెగా కోడలు.. మెగా ఇంట అడుగుపెట్టింది. తొలి దీపావళీని కూడా జరుపుకుంది. అయితే.. ఇదంతా ఒక సైడ్ మాత్రమే జరిగింది. అంటే.. లావణ్య అత్తవారింటి దగ్గర వారి రిసెప్షన్ జరిగింది. మరి.. వరుణ్ బాబు తమ అత్తవారింట కాలు పెట్టేది ఎప్పుడు..? అనే డౌట్ అందరికీ వచ్చే ఉంటుంది. హా, ఇప్పుడు ఆ డౌట్ క్లియర్ కానుంది. లావణ్య సొంత ఊరు అయిన డెహ్రాడూన్ లో కూడా మరో రిసెప్షన్ ఏర్పాటు చేయాలనీ కుటుంబం నిర్ణయించింది అంట.

Ramajogaiah Sastry: ఆ కుర్చీ మడతపెట్టి.. సరస్వతీ పుత్రుడికే కోపం తెప్పించావ్ కదరా

పెళ్లి ఇటలీలో.. రిసెప్షన్ హైదరాబాద్ లో జరిగితే.. లావణ్య తరుపు బంధువులు అందరూ .. ఇక్కడకు రాలేకపోవడంతో.. తమ సొంత ఊరులో కూడా ఒక వేడుక జరపాలని లావణ్య తల్లిదండ్రులు అనుకోవడం.. అది వరుణ్ ఫ్యామిలీ కూడా అంగీకరించడంతో.. మరోసారి ఈ జంట.. రిసెప్షన్ జరుపుకోనుంది. దీని కోసం కొత్త జంట డెహ్రాడూన్ బయల్దేరారు. నేడు కొత్త జంట ఎయిర్ పోర్ట్ లో డెహ్రాడూన్ వెళ్తూ.. కెమెరాలకు కనిపించారు. ఇక వీరితో పాటు.. మెగా డాటర్ నిహారిక కూడా కనిపించింది. ఇప్పుడు అత్తవారింట.. కొత్త అల్లుడు వరుణ్.. అక్కడ ఆచారాలను పాటించాల్సి ఉంటుంది. మరి వారి ఆచారాలకు తగ్గట్టు వరుణ్ ఎలా రెడీ అవుతాడో చూడాలంటే.. ఆ ఫోటోలు వచ్చేవరకు ఆగాల్సిందే.

Show comments