Varun Sandesh’s ‘Nindha’ Title Poster Catches Attention : ఆడియెన్స్ ఎక్కువగా ఇప్పుడు కంటెంట్, కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలను ఆదరిస్తున్నారు. మంచి కథ, కొత్త కథాంశంతో సినిమాలు చేస్తే కనుక థియేటర్లో, ఓటీటీల్లో ఇలా అన్ని చోట్లా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రస్తుతం అలాంటి ఓ కొత్త కాన్సెప్ట్‌తో వరుణ్ సందేశ్ హీరోగా ఒక సినిమా చేస్తున్నాడు. యదార్థ సంఘటనల ఆధారంగా ‘నింద’ అనే చిత్రాన్ని రాజేష్ జగన్నాథం నిర్మించడమే కాకుండా కథ, కథనాన్ని రాసి డైరెక్ట్ చేశారు. ది ఫర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద నిర్మించిన ఈ మూవీకి సంబంధించిన అప్డేట్‌ను టీం రిలీజ్ చేసింది. కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్‌తో రాబోతోన్న ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
Baak: తమన్నా, రాశి ఖన్నాల ‘బాక్’ వెనక్కి వెళ్ళింది.. ఆరోజే రిలీజ్ !
ఈ పోస్టర్‌ను గమనిస్తుంటే ఎన్నో హింట్స్ ఇచ్చినట్టు కనిపిస్తోంది. ఒక పల్లెటూరి ఊరి వాతావరణం, ఆ చీకటి, గుడిసె, కత్తి పట్టుకున్న ఓ వ్యక్తి.. కత్తి పట్టుకుని దుర్మార్గులను అంతం చేసేందుకు సిద్దంగా ఉన్న న్యాయదేవత విగ్రహం కూడా కనిపిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంట పోస్టర్‌తోనే ఎంతో ఆసక్తికిని రేకెత్తించారు. ఇక ఇప్పటికే షూట్ పూర్తి చేసుకున్న ఈ మూవీని ఆల్రెడీ ఇండస్ట్రీలోని ప్రముఖులకు చూపించారని, వారంతా కూడా సినిమాను మెచ్చుకున్నారని టీం చెబుతోంది. ఇక ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుందని అంటున్నారు. వరుణ్ సందేశ్ తో పాటు ఆనీ, తనికెళ్ల భరణి, భద్రం, సూర్య కుమార్, చత్రపతి శేఖర్, మైమ్ మధు, సిద్దార్థ్ గొల్లపూడి, అరుణ్ దలై, శ్రేయా రాణి రెడ్డి, క్యూ మధు, శ్రీరామ్ సిద్దార్థ్ కృష్ణ, రాజ్ కుమార్ కుర్రా, దుర్గా అభిషేక్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.