Nindha Song: దివ్యాంగ పిల్లలతో వరుణ్ తేజ్ సినిమా సాంగ్ లాంచ్

Varun Sandesh Song Released

Varun Sandesh Song Released

Varun Sandesh’s ‘Nindha’ Sankellu Song Unveiled by Specially abled kids: ఒకప్పుడు యూత్ ను ఒక ఊపు ఊపిన హీరో వరుణ్ సందేశ్ ప్రస్తుతం ‘నింద’ సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నారు. ది ఫెర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజేష్ జగన్నాధం దర్శకత్వంలో ఈ సినిమా రాబోతోంది. కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్‌తో యదార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీని నిర్మించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్, టీజర్ సినిమా మీద అంచనాలు పెంచేయగా ఇప్పుడు మ్యూజికల్ ప్రమోషన్‌లను ప్రారంభించారు. గానామాస్ స్పెషల్ స్కూల్‌కి చెందిన పిల్లలు ఈ పాటను విడుదల చేయడం గమనార్హం.

Amma Rajasekhar : హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న అమ్మ రాజశేఖర్ తనయుడు..

×
×
Ad

కిట్టూ విస్సాప్రగడ రాసిన సాహిత్యం, సంతు ఓంకార్ ఇచ్చిన బాణీ.. శ్రీరామచంద్ర పాడిన తీరు అద్భుతంగా ఉంది. పాటను వింటే ఉత్తేజ భరితంగా, ఆలోచన రేకెత్తించే విధంగా ఉంది. శ్రియ రాణి, ఆనీ, క్యూ మధు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో తనికెళ్ల భరణి, భద్రమ్, సూర్యకుమార్, చత్రపతి శేఖర్, మైమ్ మధు, సిద్ధార్థ్ గొల్లపూడి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో శ్రీరామసిద్ధార్థ కృష్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు. రమీజ్ నవీత్ సినిమాటోగ్రాఫర్‌గా, అనిల్ కుమార్ ఎడిటర్‌గా పని చేశారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించనున్నారు. సంగీతం సంతు ఓంకార్ అందించిన ఈ సినిమాకి కాస్ట్యూమ్ డిజైనర్ అర్చన రావు.