Site icon NTV Telugu

‘ఆర్మీ’లో చేరిపోయిన వరుణ్ ధావన్!

ప్రపంచ వ్యాప్తంగా పేరున్న బీటీఎస్ బాయ్స్ కి ఫ్యాన్స్ కొదవ అస్సలు లేదు. వాళ్ల సాంగ్స్, డ్యాన్స్ మూవ్స్ అంటే జనం పడి చచ్చిపోతున్నారు. ఇక తమని తాము ‘ఆర్మీ’గా పిలుచుకునే బీటీఎస్ ఫ్యాన్స్ ఇండియాలోనూ చాలా మందే ఉన్నారు. అందులో బాలీవుడ్ ప్రముఖులు కూడా ఉన్నారు. టైగర్ ష్రాఫ్, దిశా పఠానీ, దీపికా పదుకొణే లాంటి ఏ లిస్టర్స్ సైతం “మేం బీటీఎస్ ఆర్మీ” అని గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. మరి లెటెస్ట్ గా ‘ఆర్మీ’లో జాయిన్ అయింది ఎవరో తెలుసా?
బాలీవుడ్ అందగాడు వరుణ్ ధావన్ బీటీఎస్ బ్యాచ్ లో చేరిపోయాడు. తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ వీడియో అప్ లోడ్ చేసిన ఆయన మిత్రులతో కలసి ‘పర్మిషన్ టు డ్యాన్స్’ పాటకి స్టెప్పులేశాడు. ఒరిజినల్ వీడియోలో సౌత్ కొరియన్ పాప్ స్టార్స్ వేసిన స్టెప్పులే కాక తన స్వంత మూమెంట్స్ కూడా జత చేసి ప్రదర్శించాడు. బీటీఎస్ ‘ఆర్మీ’లో వరుణ్ కూడా చేరటంపై ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముందు ముందు మరికొందరు బాలీవుడ్ తారలు కే-పాప్ మ్యూజిక్ బ్యాండ్ పై శ్రద్ధ చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాలీవుడ్ సెలబ్రిటీలే బీటీఎస్ పాటలకు ఊగిపోతే సామాన్యులు కూడా అదే బాటలో నడుస్తారు కదా? రానున్న కాలంలో భారత్ లో బీటీఎస్ హవా బాగా పెరగవచ్చు…

Exit mobile version