Site icon NTV Telugu

Varun Dhawan Samantha: స్పై థ్రిల్లర్ షూటింగ్ మొదలవుతోంది…

Varun Dhawan Samantha

Varun Dhawan Samantha

అమెజాన్ ప్రైమ్ కోసం ఒక వెబ్ సీరీస్ చేయడానికి వరుణ్ ధావన్, సమంతా రెడీ అవుతున్నారు. ‘రుస్సో బ్రదర్స్’ ప్రొడ్యూస్ చేస్తూ, షో రన్నర్స్ గా వ్యవహరిస్తున్న ‘సీటాడెల్’ అనే ఫ్రాంచైజ్ లో భాగంగా ఒక ఇండియన్ స్పై థ్రిల్లర్ సీరిస్ ని ప్లాన్ చేస్తున్నారు. ఈ సీరీస్ ని రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేస్తుండగా సమంతా, వరుణ్ ధావన్ మెయిన్ క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నారు. జనవరిలో ఈ స్పై థ్రిల్లర్ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవ్వనుంది. ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తూ అమెజాన్ ప్రైమ్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ట్వీట్ వచ్చింది. యాక్షన్ సినిమాలని రూపొందించే ‘రుస్సో బ్రదర్స్’ తమ ‘AGBO Films’ బ్యానర్ పై సినిమాలని, వెబ్ సిరీస్ లని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. ‘సీటాడెల్’ ఫ్రాంచైజ్ ని కూడా రుస్సో బ్రదర్స్ అలానే డిజైన్ చేశారు.

‘సిటాడెల్ రైవల్ ఇంటెలిజేన్స్ ఏజెన్సీ (Citadel’s rival intelligence agency) అనే యూనివర్స్ ని క్రియేట్ చేసి… మల్టిపుల్ స్టొరీ లైన్స్, మల్టిపుల్ క్యారెక్టర్స్ తో సీరీస్ చేసి… ఆ మొత్తాన్ని ఎక్కడో ఒక చోట లింక్ చేస్తూ ‘సీటాడెల్’ ఫ్రాంచైజ్ ని రూపొందిస్తున్నారు. డిజిటల్ ప్లాట్ ఫామ్స్ హిస్టరీలోనే 250 మిలియన్ డాలర్ల భారి బడ్జట్ తో ‘సీటాడెల్’ తెరకెక్కుతోంది. ఈ ఫ్రాంచైజ్ లోని మెయిన్ సీరీస్ లో ‘రిచర్డ్ మేడెన్’, ‘ప్రియాంక చోప్రా’ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. జూన్ లో రెగ్యులర్ షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ సీరీస్ పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. రాబోయే కాలంలో ‘సిటాడెల్’ ఫ్రాంచైజ్ లో మరిన్ని క్యారెక్టర్స్ యాడ్ అవ్వనున్నాయి.

 

Exit mobile version