Varalaxmi Sarathkumar Responds on NIA Notices regarding a Drugs Case: తాజాగా కేరళలో పట్టుబడ్డ డ్రగ్స్ కేసులో తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ కి ఎన్ఐఏ అధికారులు నోటీసులు ఇచ్చినట్లుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. గతంలో వరలక్ష్మీ వద్ద పీఏ గా పనిచేసిన ఆదిలింగం అనే వ్యక్తి డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడంతో ఈ డ్రగ్స్ వ్యవహారంతో వరలక్ష్మి శరత్ కుమార్ కి ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో ఎన్ఐఏ అధికారులు విచారించబోతున్నారంటూ వార్తలు తెరమీదకు వచ్చాయి. అయితే ఈ వ్యవహారం మీద తాజాగా వరలక్ష్మి శరత్ కుమార్ తన ట్విట్టర్ వేదికగా ఒక క్లారిటీ ఇస్తూ సుదీర్ఘమైన నోట్ షేర్ చేశారు. తాజాగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఖచ్చితంగా తాను ఈ విషయం మీద స్పందించాలని నిర్ణయించుకున్నానని ఆమె చెప్పుకొచ్చారు. ఆదిలింగం ఇన్వాల్వ్ అయిన ఒక కేసులో ఎన్ఐఏ నాకు నోటీసులు ఇచ్చిందంటూ వార్తల్లో వస్తున్నవి ఏవి నిజం కాదు అవన్నీ పుకార్లే నాకు ఎలాంటి సమన్లు ఎవరూ జారీ చేయలేదు అలాగే పర్సనల్ గా నన్ను హాజరు కమ్మని కూడా కోరలేదు.
Vijay Deverakonda: బిగ్ బ్రేకింగ్: పెళ్లి పీటలెక్కనున్న విజయ్ దేవరకొండ?
ఆది లింగం అనే వ్యక్తి నా వద్ద మూడేళ్ల క్రితం ఒక ఫ్రీలాన్స్ మేనేజర్ గా పనిచేశాడు. ఆ సమయంలో నేను ఇతరఫ్రీలాన్స్ మేనేజర్లతో కూడా కలిసి పని చేశాను. అతను నాతో పని చేసి మానేసిన తర్వాత అతనితో ఎలాంటి సంబంధం బాంధవ్యాలు, కానీ కమ్యూనికేషన్ కానీ ఈ రోజు వరకు లేదు. నిజానికి వార్తలు చూసి నేను కూడా షాక్ అయ్యాను, నా వైపు నుంచి ఏమైనా ప్రభుత్వానికి అసిస్టెన్స్ ఇవ్వాల్సి ఉంటే ఖచ్చితంగా నేను సహకరిస్తానని ఆమె పేర్కొన్నారు. అయితే ఎలాంటి నిజాలు క్లారిఫికేషన్లు లేకుండానే ఇలా అనవసరంగా సెలబ్రిటీలను ఇలాంటి విషయాల్లోకి లాగడం చాలా బాధ కలిగిస్తుంది ఈ విషయంలో మీడియాని నేను ఒకటే అభ్యర్థిస్తున్నాను ఇలాంటి విషయాలలో ఆర్టికల్స్ పబ్లిష్ చేసేముందు కొంత క్లారిటీ తీసుకుని పబ్లిష్ చేయండి అంతేకానీ లేనిపోని రూమర్స్ స్ప్రెడ్ చేయవద్దు అని ఆమె కోరారు.
