Varalaxmi Sarathkumar : నేను అరవను కరుస్తా…డైరెక్టర్’కు వరలక్ష్మీ స్ట్రాంగ్ కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Varalaxmi Sarathkumar Controversy : వరలక్ష్మీ శరత్‌కుమార్ పేరు చుట్టూ వివాదాలు కొత్తేమీ కాదు. అయితే ఈసారి పరిస్థితి కొంచెం భిన్నంగా కనిపిస్తోంది. దర్శకుడు సంజీవ్ మేగోటి తెరకెక్కిస్తున్న ‘పోలీస్ కంప్లైంట్’ సినిమాలో వరలక్ష్మీ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలకు ముందే దర్శకుడు చేసిన ఆరోపణలు, ఆ తర్వాత వరలక్ష్మీ ఇచ్చిన కౌంటర్ ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఒకవైపు ప్రమోషన్స్‌కు సహకరించడం లేదంటూ దర్శకుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తే, మరోవైపు వరలక్ష్మీ కూడా అదే తరహాలో కౌంటర్ ఇచ్చింది.
దర్శకుడు సంజీవ్ మేగోటి తెరకెక్కించిన ‘పోలీస్ కంప్లైంట్’ సినిమాలో వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్ర పోషించారు. సినిమా విడుదలకు ముందు ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్న సమయంలో, దర్శకుడు చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా చర్చనీయాంశమయ్యాయి. భారీ మొత్తంలో పారితోషికం తీసుకున్నప్పటికీ, వరలక్ష్మీ ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరు కావడం లేదని ఆయన ఆరోపించారు. సినిమా టీమ్‌కు తగిన సహకారం అందడం లేదనే అసంతృప్తిని కూడా వ్యక్తం చేశారు. అంతేకాదు డబ్బింగ్ సమయంలోనూ ఇబ్బందులు పెట్టారని వాపోయారు.
Also Read
- Rudravanam : తల లేని మృతదేహం.. గుండెలు జలదరించే మిస్టరీ: 'రుద్రవనం'లో దాగున్న ఆ భయంకరమైన రహస్యాలేంటి?
- Mouli: వీడేం చేయగలడు, బచ్చాగాడు అనుకున్నారు..పెద్ద ఫ్యామిలీ యాక్టర్ అయితే ఇలా చేసేవారా?
- Donga Naa Koduku Teaser: ఏంటి మౌళి.. పబ్లిక్‌గా టిఫిన్ చేసేస్తున్నావ్..! ‘దొంగ నా కొడుకు’ టీజర్ విడుదల..
- Jayaho Ramanuja: సంస్కృతంతో సహా ఆరు భాషల్లో 'జయహో రామానుజ'
ఈ వ్యాఖ్యలు మీడియాలో వైరల్ కావడంతో అందరి దృష్టి వరలక్ష్మీ వైపు మళ్లింది. అయితే ఆమె కూడా ఇన్‌స్టా వేదికగా తనదైన స్టైల్ లో స్పందించింది. తనను ఎక్కడికి పిలిచారో అక్కడికి హాజరయ్యానని, తాను చేయాల్సిన బాధ్యతలను నిర్వర్తించానని చెప్పుకొచ్చారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో దర్శకుడు తనపై చేసిన వ్యాఖ్యల పూర్తి వివరాలు తనకు తెలియవని, పూర్తి సమాచారం లేకుండా స్పందించడం సరైంది కాదని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఈ వివాదాన్ని మరింత పెద్దదిగా మార్చే ఉద్దేశం తనకు లేదని కూడా వెల్లడించారు.
ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా విడుదల చేసిన నోట్లో ఆమె మాటలు మరింత ఆసక్తిని రేకెత్తించాయి. కొన్ని విషయాల్లో తనకు స్వంత అభిప్రాయాలు ఉంటాయని, అందుకే చిత్రబృందం చేస్తున్న ఆరోపణలపై బహిరంగ వాదనకు దిగడం ఇష్టంలేదని చెప్పారు. అయితే అక్కడితో ఆగకుండా మరో స్టోరీలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కొన్ని కుక్కలు అరుస్తాయి కానీ కరవవు, నేను అరవను కానీ కరుస్తా అంటూ ఆమె చేసిన పోస్ట్‌ను చాలామంది దర్శకుడు సంజీవ్ మేగోటికి ఇచ్చిన పరోక్ష కౌంటర్‌గా భావిస్తున్నారు.
ఇలాంటి వివాదాలు సినిమా విడుదలకు ముందు తరచుగా కనిపిస్తుంటాయి. కొన్నిసార్లు అవి ప్రచారంలో భాగమని భావించే వారు ఉంటారు. మరికొన్నిసార్లు నిజంగానే చిత్రబృందం, నటీనటుల మధ్య ఏర్పడిన అభిప్రాయ భేదాల ఫలితంగా బయటకు వస్తాయి. ‘పోలీస్ కంప్లైంట్’ విషయంలో ఏది నిజమో కాలమే చెప్పాలి. అయితే ఈ వివాదం కారణంగా సినిమాపై ప్రేక్షకుల ఆసక్తి మాత్రం మరింత పెరిగిందనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు దర్శకుడి వాదనకు మద్దతు ఇస్తుండగా, మరికొందరు వరలక్ష్మీ స్పందనను సమర్థిస్తున్నారు. ఏది ఏమైనా, సినిమా విడుదలకు ముందు మొదలైన ఈ మాటల యుద్ధం ‘పోలీస్ కంప్లైంట్’కు అదనపు ప్రచారాన్ని తీసుకొచ్చిందనే చెప్పాలి. ఇప్పుడు అందరి దృష్టి జూన్ 12న విడుదల కానున్న సినిమాపైనే ఉంది. ప్రేక్షకుల తీర్పు ఎలా ఉండబోతోందో చూడాలి.
తాజావార్తలు
-
Fake Press IDs: అంగట్లో జర్నలిస్టు ఐడీలు.. రూ.599 చెల్లిస్తే చాలు..
-
NZ Vs IND: కివీస్‌తో తొలి టీ20.. బరిలోకి స్టార్ ప్లేయర్.. పిచ్ రిపోర్ట్, తుది జట్ల వివరాలు ఇవే..
-
Saudi Arabia: ప్రేమకు మరణశిక్ష.. సౌదీ యువరాణి మిషాల్ విషాదగాథ
-
CM Chandrababu Naidu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసర ధరలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
-
CJP: షరతులు వర్తిస్తాయి.. తీహార్ జైలు నుంచి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా విడుదల.
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!