Varalaxmi Sarath Kumar: ఇప్పటివరకూ ఏ సినిమాలో ఇలాంటి సీన్ చేయలేదు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Varalaxmi Sarath Kumar Exclusive Web Interview for Kotabommali PS Movie: రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ లీడ్ రోల్స్‌లో శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలకపాత్రలు పోషించగా ‘అర్జున ఫల్గుణ’ ఫేమ్ తేజ మార్ని తెరకెక్కించిన ‘కోట బొమ్మాళి పీఎస్’ నవంబర్ 24న సినిమా విడుదలవుతున్న సందర్భంగా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన వరలక్ష్మీ శరత్ కుమార్ మీడియాతో ముచ్చటించారు. . గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించారు.
‘‘నా కెరీర్‌లో ఎక్కువ పోలీస్ క్యారెక్టర్సే వస్తున్నాయి. తమిళంలో చాలా చేశాను, కానీ.. తెలుగు ఆడియెన్స్‌కు మాత్రం ఫస్ట్ టైమ్ పోలీస్ గెటప్‌లో కనిపిస్తున్నా. ప్రస్తుతం ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ట్రెండ్ నడుస్తోంది, వాటిలో పోలీస్ ఆఫీసర్‌గానే కనిపించాలి, అయితే ప్రతి స్ర్కిప్ట్ డిఫరెంట్‌గా ఉంటుంది. ఇది కూడా డిఫరెంట్‌గానే ఉంటుంది, తెలుగు ప్రేక్షకులకు కొత్తగా కనిపించాలని చాలా ట్రై చేస్తున్నా. నేను కథే హీరోగా భావిస్తా, ఇందులో శ్రీకాంత్ గారు ఒక పోలీస్ ఆఫీసర్, నేనొక పోలీస్ ఆఫీసర్ అని చెప్పుకొచ్చారు., ఇద్దరిలో ఒకరు క్రిమినల్ అయితే ఎలా ఉంటుంది? పోలీసులపై పొలిటికల్ ప్రెజర్ ఏ విధంగా ఉంటుందనేది ఈ మూవీ కాన్సెప్ట్. క్యాట్ అండ్ మౌస్ గేమ్‌లా థ్రిల్ చేసేలా సినిమా ఉంటుందన్నారు. స్ర్కిన్‌ప్లే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఇప్పుడు ఎలక్షన్ టైమ్‌లో రావడం మరింత ఆసక్తికరంగా ఉంటుంది, ఓటు గురించి అవగాహన కల్పించేలా లైన్ కూడా ఉంటుంది అయితే ‘నాయట్టు’కి రీమేక్ అయినా దానికి దీనికి చాలా మార్పులు చేశారు. ఇందులో నా క్యారెక్టర్ బాగా పెంచారు, ఈ సినిమాలో నాకు స్మోకింగ్ చేయడం ఛాలెజింగ్‌గా అనిపించింది, ఇప్పటివరకూ ఏ సినిమాలో ఇలాంటి సీన్ చేయలేదు, అందుకే ఛాలెజింగ్‌గా అనిపించింది. క్యారెక్టర్‌కి ఆ సీన్ కంపల్సరీ కాబట్టి చేయాల్సి వచ్చింది, యాక్షన్ కంటే మైండ్ గేమ్ ఎక్కువగా ఉంటుందన్నారు. పొలిటికల్ సిస్టమ్, పోలీస్ సిస్టమ్ గురించి చూపించాం కానీ, ఏ పార్టీకి సంబంధం ఉండదన్నారు వరలక్ష్మి. లింగిడి లింగిడి పాటకు మంచి రెస్పాన్స్ రావడం సంతోషంగా ఉంది, దర్శకుడు తేజ మార్ని చాలా క్వాలిటీగా తీశారని ఆమె అన్నారు. మంచి క్యారెక్టర్స్ చేయడమే నా గోల్, వరలక్ష్మీ చాలా డిఫరెంట్‌గా చేసిందని ప్రేక్షకులు అనుకోవాలనుకుంటా. లేడీ ఓరియెంటెండ్ సినిమాలతో పాటు క్యారెక్టర్ నచ్చితే ఎలాంటి మూవీలోనైనా నటించడానికి రెడీ. ఈ సంక్రాంతికి నేను నటించిన హనుమాన్ విడుదలవుతోంది. కన్నడలో సుదీప్‌తో కలిసి మ్యాక్స్ చిత్రంలో నటిస్తున్నా, ఇక మరికొన్ని ప్రాజెక్టులు లైన్‌లో ఉన్నాయి. త్వరలోనే అనౌన్స్‌మెంట్స్ వస్తాయి.
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
తాజావార్తలు
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Jio AI Glasses: కళ్లజోడుతోనే UPI పేమెంట్స్.. లైవ్ క్రికెట్ కామెంటరీ కూడా!
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!