Varalaxmi Sarath Kumar: కోలీవుడ్ స్టార్ హీరో శరత్ కుమార్ గురించి, ఆయన కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శరత్ కుమార్ హీరోయిన్ రాధికను రెండో పెళ్లి చేసుకున్నారు. ఇక శరత్ కుమార్ మొదటి భార్య కూతురు హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్ ఈ పెళ్లి ఇష్టం లేదని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఆమె ఇలాంటివాటిని అన్నీ ఖండిస్తూనే వస్తోంది. ఇక కొన్నిసార్లు శరత్ కుమార్ సైతం వీరి బాదం గురించి మాట్లాడుతూనే ఉంటారు. రాధికతో వరు బంధం గురించి చెప్పడానికి ఏమి లేదని, వారు ఇద్దరు మంచి స్నేహితులుగా ఉంటారని చెప్పుకొచ్చారు. అయితే ఇటీవలే రాధికతో తండ్రితో పడడంలేదని, అందుకే హైదరాబాద్ కు మకాం మార్చేసిందని కూడా చెప్పుకొచ్చారు. ఇక తాజాగా మరోసారి నెటిజన్స్.. వరలక్ష్మీ, రాధిక మధ్య గొడవలు ఉన్నాయని, ఇందుకు సాక్ష్యం ఇదేనని చెప్పుకొస్తున్నారు. నిన్న రాధికా 60 వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి.
కోలీవుడ్ స్టార్ హీరోలు సూర్య, ధనుష్, అలనాటి అందాల తారలందరూ ఈ ఈవెంట్ కు హాజరయ్యారు. వరలక్ష్మీ కూడా ఈ పార్టీలో హంగామా చేసింది. అయితే ఈ ఫోటోలను షేర్ చేస్తూ రాధికా శరత్ కుమార్ ను ఆంటీ అంటూ సంబోధించిది. రాధిక ఆంటీ.. హ్యాపీ బర్త్ డే అంటూ రాసుకొచ్చింది. అమ్మ అనాల్సింది పోయాయి ఆంటీ అంటున్నావేంటి..? ఆమె కూడా నీకు తల్లితో సమానమే కదా అంటూ పలువురు నెటిజన్స్ కామెంట్స్ పెడుతుండగా.. మరికొందరు వారిద్దరి మధ్య ఇంకా గొడవలు తగ్గినట్లు లేవు అని చెప్పుకొస్తున్నారు. ఇక ఇంకొందరు ఈ రూమర్స్ నిజమే కాదని వారిద్దరూ మంచి స్నేహితులని, వరలక్ష్మీ మొదటి నుంచి రాధికను ఆంటీ అనే పిలుస్తుందని అంటున్నారు. ఏదిఏమైనా కోలీవుడ్ లో వీరి బంధం మాత్రం చాలా ప్రత్యేకమని చెప్పుకొస్తున్నారు.
