NTV Telugu Site icon

Vaishnav Tej: ‘రుద్ర కాళేశ్వర రెడ్డి’గా మారిన మెగా మేనల్లుడు… మాములుగా లేడుగా

Panja Vaishnav Tej

Panja Vaishnav Tej

మెగా మేనల్లుడు, మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన హీరో పంజా వైష్ణవ్ తేజ్. ఉప్పెన సినిమాతో సాలిడ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన వైష్ణవ్ తేజ్ పూర్తి స్థాయి కమర్షియల్ బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమా చేస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్  బ్యానర్ పై ‘PVT 04’ అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీని శ్రీకాంత్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. మంచు మనోజ్ తో ‘అహం బ్రహ్మాస్మి’ సినిమాని అనౌన్స్ చేసిన శ్రీకాంత్ రెడ్డి, ఆ ప్రాజెక్ట్ ఆగిపోవడంతో వైష్ణవ్ తేజ్ తో సినిమా చేస్తున్నాడు. యంగ్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీలో మలయాళ టాలెంటెడ్ యాక్టర్ జోజు జార్జ్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. తమిళ హీరోయిన్ అపర్ణ దాస్ మరో కీ రోల్ లో కనిపించనున్న ఈ సినిమాకి జీవీ ప్రకాష్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

ఇటివలే బ్యాక్ టు బ్యాక్ ఆర్టిస్టుల పోస్టర్స్ ని రిలీజ్ చేస్తూ వచ్చిన మేకర్స్, లేటెస్ట్ గా ఈ మూవీ టైటిల్ ని అనౌన్స్ చేస్తూ గ్లిమ్ప్స్ ని లాంచ్ చేశారు. ‘PVT 04’కి ఆదికేశవ అనే టైటిల్ ని ఫిక్స్ చేసిన మేకర్స్, గ్లిమ్ప్స్ ని మాస్ గా కట్ చేశారు. టెంప్లేట్ కమర్షియల్ సినిమాని గుర్తు చేసేలా… “ఒక గుడిని కూల్చడానికి కొంతమంది మనుషులు వెళ్లడం, పూజారి ఆపడానికి ప్రయత్నించడం, ఆ రౌడీలని హీరో కొట్టడం, ఈ విషయం విలన్ వరకూ వెళ్లి… తన మనుషులని కొట్టింది ఎవరు అని అడగంతో హీరో ఇంట్రడక్షన్…” ఇదే ఫార్మాట్ లో ఆదికేశవ గ్లిమ్ప్స్ కి కట్ చేశారు. వైష్ణవ్ తేజ్ ‘రుద్ర కాళేశ్వర రెడ్డి’గా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. వైష్ణవ్ తేజ్ బాడీ లాంగ్వేజ్ బాగుంది, ఫిట్ గా కనిపిస్తున్నాడు. టెంపుల్ బ్యాక్ డ్రాప్ లో చాలా సినిమాలు వచ్చాయి మరి వాటికి ‘ఆదికేశవ’ సినిమాకి మధ్య డిఫరెన్స్ ని ఎలా చూపిస్తారు అనేది చూడాలి.

Show comments