Site icon NTV Telugu

Vaibhavi Upadhyay: కారు యాక్సిడెంట్ లో సీరియల్ నటి మృతి

Vaibhavi

Vaibhavi

Vaibhavi Upadhyay: గత కొన్ని రోజుల నుంచి చిత్ర పరిశ్రమలో వరుస మరణాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్ అని లేకుండా సినీ తారలు మృత్యువాత పడుతున్నారు. తాజాగా బాలీవుడ్ యువ సీరియల్ నటి కారు ప్రమాదంలో మృతిచెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. బాలీవుడ్ సీరియల్ నటి వైభవి ఉపాధ్యాయ కారు ప్రమాదంలో మృతి చెందింది. ఆమె ‘సారాభాయ్ వర్సెస్ సారాభాయ్’ సీరియల్ తో ఫేమస్ అయ్యింది. వైభవి వయస్సు 32 ఏళ్ళు. ఇటీవలే ఆమె.. తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి హిమాచల్ ప్రదేశ్ వెకేషన్ కు వెళ్ళింది.

Sathi Gani Rendu Ekaralu: పుష్ప గాడి ఫ్రెండ్ రెండు ఎకరాల లొల్లి ఏందీ సామీ

ఇక ఎంతో ఆనందంగా జ్ఞాపకాలను పోగుచేసుకొని తిరిగి వస్తుండగా.. ఆమె కారు లోయలోకి దూసుకు వెళ్లింది. దాంతో వైభవి అక్కడిక్కడే మృతి చెందింది. ఇక కారులో ఉన్న వైభవి ప్రియుడు గాయాలతో బయటపడ్డాడు. ఈ అనుకోని సంఘటనకు అభిమానులే కాదు ఇండస్ట్రీ మొత్తం షాక్ కు గురయ్యింది. అతి చిన్న వయస్సులోనే వైభవి ఇంత దారుణంగా మృతిచెందడం విషాదమని సినీ ప్రముఖులు చెప్పుకొస్తున్నారు. వైభవి సీరియల్స్ మాత్రమే కాదు దీపికా నటించిన ఛపాక్ సినిమాలో కూడా నటించి మెప్పించింది. నేడు ముంబైకి వైభవి మృతదేహంను తీసుకు వచ్చారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని సినీ ప్రముఖులు ట్వీట్ చేస్తున్నారు.

Exit mobile version