Vaazha 2 OTT: బాక్సాఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేసిన ‘వాలా 2’ డిజిటల్ ఎంట్రీ!

Vaazha 2 Ott

Vaazha 2 Ott

ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద పెద్ద హీరోల సినిమాల కంటే యువతను ఆకట్టుకునే చిన్న సినిమాలే ఎక్కువ ప్రభావం చూపాయి. ఈ కోవలోనే మలయాళం నుంచి వచ్చిన ‘వాలా 2’ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. దీనికి ముందు వచ్చిన ‘వాలా’ అక్కడ సెన్సేషనల్ హిట్ కాగా, అదే దర్శకుడు సావిన్ ఎస్ ఏ పార్ట్ 2 కోసం పూర్తిగా కొత్త నటీనటులను ఎంచుకుని, అంతకు మించిన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ చిత్రం మలయాళంలో ఈ ఏడాది బిగ్గెస్ట్ గ్రాసర్‌లలో ఒకటిగా నిలిచింది.

తెలుగులో ఈ చిత్రాన్ని నిర్మాత సాహు గారపాటి విడుదల చేయగా, ఇక్కడ కూడా యువత నుంచి మంచి స్పందన లభించింది. యూత్ ఫుల్ ఎమోషనల్ ఎంటర్టైనర్‌గా సాగే ఈ చిత్రం ఫైనల్‌గా ఓటిటి ప్రేక్షకులను పలకరించేందుకు వచ్చేసింది. ప్రముఖ ఓటిటి సంస్థ జియో హాట్ స్టార్ (Jio Hotstar) ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకోగా, నేటి నుంచి తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ మరియు హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. హషీర్ హెచ్, అలన్ బిన్ సిరాజ్, వినాయక్ వి, అజిన్ జాయ్ వంటి యంగ్ టాలెంట్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా, స్నేహం.. ఎమోషన్స్ చుట్టూ తిరుగుతుంది. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన వారు ఇప్పుడు హాయిగా తమ ఇంట్లోనే ఓటిటిలో చూసి ఎంజాయ్ చేయవచ్చు.