Site icon NTV Telugu

Ustaad Bhagath Singh: మస్త్ ఫాస్ట్ ఉన్నారన్నా…

Ustaad Bhagath Singh

Ustaad Bhagath Singh

గబ్బర్ సింగ్ సినిమాతో సినీ అభిమానులందరికీ సాలిడ్ కిక్ ఇచ్చిన కాంబినేషన్ ‘హరీష్ శంకర్-పవన్ కళ్యాణ్’లది. యాటిట్యూడ్ కి కేరాఫ్ అడ్రెస్ గా ఉండే, హీరోయిజంకి బెంచ్ మార్క్ లా ఉండే ఈ కాంబినేషన్ కి ఒక క్రేజ్ ఉంది. ఒక ఫ్యాన్ తన ఫేవరేట్ హీరోని డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో హరీష్ శంకర్ చేసి చూపించాడు. ఆల్మోస్ట్ దశాబ్దం తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీ తమిళ ‘తెరి’ సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతుందని అనధికార సమాచారం. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ఇటివలే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. పవన్ కళ్యాణ్ కి సంబంధించిన కొన్ని సీన్స్ ని హరీష్ శంకర్ ఈ షెడ్యూల్ లో షూట్ చేశాడు. సెట్స్ నుంచి బయటకి వచ్చిన మేకింగ్ స్టిల్స్ అండ్, అఫీషియల్ గా రిలీజ్ చేసిన సిల్లౌట్ ఫొటోలకి సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ పోస్టర్స్ లో పవన్ కళ్యాణ్ పోలిస్ యూనిఫామ్ లో ఉండడంతో, సినీ అభినులంతా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా తెరి రీమేక్ అని ఫిక్స్ అయిపోయారు.

ఇటివలే ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకుంది, ఈ షెడ్యూల్ కంప్లీట్ అవ్వగానే హరీష్ శంకర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఎడిటింగ్ వర్క్స్ స్టార్ట్ చేశాడు. త్వరలో బ్లాస్టింగ్ అప్డేట్స్ బయటకి రాబోతున్నాయి వెయిట్ చెయ్యండి అంటూ మేకర్స్ ట్వీట్ చేశారు. ఒక్క షెడ్యూల్ లో షూట్ చేసిన ఎపిసోడ్స్ నుంచే ఒక వీడియోని ఎడిట్ చేసి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి గిఫ్ట్ గా మే 12న ఒక వీడియో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ అయ్యింది మే 11న. ఆ మూవీకి ట్రిబ్యూట్ గా మే 12న ఉస్తాద్ భగత్ సింగ్ అప్డేట్ ని రిలీజ్ చేస్తే బాగుంటుందని హరీష్ శంకర్, ఈ స్పెషల్ వీడియోని ప్లాన్ చేసాడట. మరి ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి బయటకి రానున్న మొదటి ప్రమోషనల్ కంటెంట్ ఏ రేంజులో ఉంటుందో చూడాలి.

Exit mobile version