దేశంలో మళ్ళీ కరోనా విజృంభించే సూచనలు కన్పిస్తున్నాయి. కరోనా కేసులు మరోమారు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీలోనూ మళ్ళీ కరోనా కలకలం మొదలైంది. ఇటీవలే ‘అఖండ’ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ రెండవ సారి కరోనా బారిన పడగా, ఇప్పుడు మరో సీనియర్ హీరోయిన్ కూడా తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది అంటూ ప్రకటించారు.
Read Also : పునీత్ కోసం కొత్త బాధ్యతను భుజానికెత్తుకున్న విశాల్… ఎమోషనల్ స్పీచ్
ప్రముఖ బాలీవుడ్ నటి, రాజకీయ నాయకురాలు ఊర్మిళా కరోనా బారిన పడ్డారు. ఊర్మిళ స్వయంగా ఈ విషయాన్నీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఆదివారం ట్విట్టర్‌లో “నాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం బాగానే ఉన్నాను. హోమ్ క్వారంటైన్‌లో ఒంటరిగా ఉన్నాను. గత 15 రోజుల్లో నన్ను కాంటాక్ట్ అయిన ప్రతి ఒక్కరినీ వెంటనే కరోనా పరీక్షా చేయించుకోవాలని నేను అభ్యర్థిస్తున్నాను. దీపావళి సంబరాల్లో మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలని, మీ ప్రియమైన వారందరినీ ప్రేమగా చూసూకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను” అని ఊర్మిళ ట్వీట్ చేసింది.
ఊర్మిళ రంగీలా, గయాన్, సత్య అండ్ కంపెనీ, కమల్ హాసన్ ‘భారతీయుడు’ మొదలైన చిత్రాల్లో నటించింది. ఆమె 2016లో తన ప్రియుడు మొహసిన్ అక్తర్ మీర్‌ను వివాహం చేసుకుంది. ఆమె గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ టిక్కెట్‌పై ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత శివసేన పార్టీలో జాయిన్ అయ్యారు.
