ఉర్ఫీ జావేద్.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గత రెండేళ్ల నుంచి విభిన్నమైన క్యాస్ట్యూమ్స్ తో తన అందాలను విభిన్నంగా చూపిస్తుంది ఈ బిగ్ బాస్ బ్యూటీ . ఈ బ్యూటిఫుల్ తాజాగా మరో డిఫరెంట్ కాస్ట్యూమ్ తో తన హాట్ అందాలను చూపించింది. తన డిఫరెంట్ క్యాస్ట్యూమ్స్ తో బాగా క్రేజ్ పెంచుకుంటుంది ఈ భామ. తన హాట్ అందాలు బయట పడేలా చిత్ర విచిత్రమైన దుస్తులతో వెరైటీ డిజైన్లతో ఎప్పుడూ ట్రెండీగా ఉంటూనే వివాదాస్పదంగా మారుతూ ఉంటుంది ఈ హాట్ భామ. అయితే ఈ అమ్మడి వేషధారణపై విమర్శలు చేసేవాళ్లతోపాటు ప్రశంసించే వాళ్లు కూడా ఎంతో మంది ఉన్నారు.చాలా కాలంగా తాను ధరించే దుస్తులపై విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి. కానీ ఆమె ఎలాంటి ట్రోలింగ్ వచ్చినా పట్టించుకోకుండా మరిన్ని వెరైటీ డ్రెస్సులతో దర్శనం ఇస్తూ వస్తోంది..
ఇలా డిఫరెంట్ వస్త్రధారణతో బాగా ఫేమస్ అయింది ఉర్ఫీ.ఎందుకంటే ట్రోలింగ్ చేసిన ప్రతీ సారి తనలోని క్రియేటివిటీ ని బయటకు తీసి మరిన్ని డిఫరెంట్ క్యాస్ట్యూమ్స్ తో దర్శనమిస్తుంది..తన విభిన్న దుస్తులతో నిత్యం ఆశ్చర్యపరిచే ఈ హాట్ బ్యూటి గతేడాది గూగుల్ లో అత్యధికంగా సెర్చ్ చేసిన ఆసియన్ జాబితాలో 57వ స్థానం సంపాదించుకుని సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.సోషల్ మీడియా ద్వారా బాగా పాపులర్ అయిన ఉర్ఫీ జావేద్ మోడల్ గా తన కెరీర్ ను ప్రారంభించిన మొదట్లో సినీ ఇండస్ట్రీలో అవకాశాల కోసం టెలివిజన్ రంగం వైపు దృష్టి సారించింది. అప్పుడే హిందీ బిగ్ బాస్ లో పాల్గొనే అవకాశం ఆమెకు లభించింది. ఓటీటీ సీజన్ 1లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది అక్కడ కూడా ఎంతో బోల్డ్ గా వ్యవహరించింది. బిగ్ బాస్ తర్వాత విచిత్రపు వేషధారణతో భారీ క్రేజ్ సంపాదించుకుంది ఉర్ఫీ. ఇదివరకు టీ బ్యాగులు, పిజ్జా మరియు మిక్చర్ ప్యాకెట్ల డ్రెస్సులతో కనిపించిన ఈ బ్యూటి తాజాగా షూలను తయారు చేసే క్లాత్ తో చేసిన డ్రెస్ తో దర్శనమిచ్చింది. ఇందులో అక్కడక్కడ చిరిగి ఉండి తన హాట్ అందాలు కనిపిస్తున్నాయి.ప్రస్తుతం ఈ లుక్ బాగా వైరల్ గా మారింది.
