Unstoppable Season 2: నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో అన్ స్టాపబుల్. ఆహా ఓటిటీ ప్రతిష్టాత్మకంగా ఈ షోను నిర్వహిస్తోంది. ఇప్పటికే ఈ షో సీజన్ 1 భారీ విజయాన్ని అందుకొంది. స్టార్ల యాక్షన్.. బాలకృష్ణ రియాక్షన్స్.. కౌంటర్లు, సెటైర్లు, పంచులు.. అబ్బో ప్రేక్షకులకు వినోదమే వినోదం. పది ఎపిసోడ్లు.. మోహన్ బాబు తో మొదలై మహేష్ బాబు తో ముగిసింది. ఇక ఈ ఎపిసోడ్స్ అన్నింటిలోనూ బాలయ్య ఎనర్జీ అస్సలు తగ్గేదేలే అన్నట్లుగా ఉంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక సీజన్ 1 బంపర్ హిట్ అందుకోవడంతో సీజన్ 2 కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తూ వచ్చారు. ఇక ఎదురుచూపులు ఫుల్ స్టాప్ పెడుతూ బాలయ్య అన్ స్టాపబుల్ సీజన్ 2 తో వచ్చేశాడు.
ఇప్పటికే ఈ సీజన్ 2 పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా సీజన్ 2 ప్రోమో టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. డైలాగ్స్ లేకపోయినా బాలయ్య ఎలివేషన్ షాట్స్ పిచ్చెకిస్తున్నాయి. ఒక పాడుబడిన గుహలో ఒక మ్యాప్ ను కనిపెట్టి అందులో నుంచి బయటికి వచ్చే బాలయ్య లుక్ ఆకట్టుకొంటుంది. ఒక వేటగాడిలా చేతిలో గొడ్డలి, కత్తి పట్టుకొని దర్శనమిచ్చాడు బాలయ్య. ఇక మ్యాన్ ఆఫ్ ది మాస్ నెవ్వర్ బిఫోర్ లుక్ అంటూ బాలయ్య లుక్ ను రివీల్ చేశారు. మరోసారి గర్జించడానికి ఎప్పుడు చూడని అవతారంలో బాలకృష్ణ అన్ స్టాపబుల్ 2 తో మీ ముందుకు వస్తున్నారు అని టీజర్ లో రాసుకొచ్చారు. మొత్తానికి టీజర్ తోనే ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించారు. ఈ ఎలివేషన్స్, మ్యూజిక్ చూస్తుంటే కెజిఎఫ్ కు మించి ఉన్నట్లుగా ఉందని బాలయ్య అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇక ఈ టీజర్ కు యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం ఈ టీజర్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది.
https://www.youtube.com/watch?v=Nfd9Xi6FMIs
